Manchu Vishnu..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మితమవుతున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో ఊహించని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మోహన్ లాల్ (Mohan Lal), ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మంచు విష్ణు (Manchu Vishnu),మోహన్ బాబు (Mohan babu), కౌశల్ (Kaushal), సప్తగిరి (Saptagiri), బ్రహ్మానందం (Brahmanandam) తో పాటు తదితర సెలబ్రిటీలు భాగమైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎన్నో కలలు కన్నారు. అందులో భాగంగానే సెలబ్రిటీలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. పైగా ఈ సినిమా నుండి గ్లింప్స్, లిరికల్ సాంగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు.. కానీ ఏ ఒక్కటి ప్రేక్షకులను మెప్పించలేదు. కనీసం ఇప్పటికైనా ఈ సినిమా వీ ఎఫ్ ఎక్స్ విషయంలో జాగ్రత్త తీసుకొని, విడుదల చేయాలని అభిమానులు కూడా కోరారు. ముఖ్యంగా ఈ సినిమాపై ఇప్పుడు ఎక్కువగా నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను వాయిదా వేసినట్లు విష్ణు ప్రకటించారు.
వాయిదా పడ్డ కన్నప్ప.. క్షమాపణలు చెప్పిన మంచు విష్ణు..
కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. హైయెస్ట్ స్టాండర్డ్స్ తో సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చారు. ఇంకా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉన్న కారణంగానే.. సినిమాను కాస్త ఆలస్యంగానే విడుదల చేస్తామని, ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నారు. తాజాగా మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్టులో.. “అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. మీరు కన్నప్ప సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. కానీ ఈ సినిమాను మరింత అద్భుతంగా మీ ముందుకు తీసుకురావడానికి వీ ఎఫ్ ఎక్స్ వర్క్ ఎంతో అవసరం. అందుకే ప్రస్తుతానికి ఆ పని మీదే అందరం దృష్టి పెట్టాము. కచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ ముందుకు వస్తాము. త్వరలోనే సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తాము. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మన్నిస్తారని కోరుతున్నాను” అంటూ మంచు విష్ణు అందులో రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో ఆలస్యంగా తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇకనైనా ఈ సినిమాను ఆడియన్స్ మెచ్చేలా రూపు దిద్దుతారా అంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆలస్యంగా విడుదలవుతున్న ఈ సినిమా మంచు విష్ణుకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
కన్నప్ప సినిమా పైనే మంచు విష్ణు ఆశలు..
కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను బాలీవుడ్ లో రామాయణం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మంచు విష్ణు తన అవ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ల పైన నిర్మిస్తున్నారు.. ముఖ్యంగా ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగానే కేటాయించడం జరిగింది. అటు వ్యక్తిగత విషయాలను కూడా పక్కనపెట్టి ఈ సినిమా కోసం పనిచేస్తున్న మంచు విష్ణుకి ఈ సినిమా ఎలాంటి పేరు ప్రఖ్యాతలు అందిస్తుందో చూడాలి.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025