Big Stories

Ramanavami in Ayodhya : బాలరాముడికి సూర్యతిలకం.. దర్శనమిచ్చిన మహత్తర దృశ్యం (వీడియో)

Suryatilakam for Ram lalla : అయోధ్య రామాలయం నిర్మాణమయ్యాక తొలిసారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు వేచిచూస్తోన్న మహత్తర దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడికి సూర్యుడు తన కిరణాలతో తిలకం దిద్దే.. ఆ అబ్బుర దృశ్యాన్ని చూసి.. భక్తులు తన్మయత్వం చెందారు. సూర్యతిలకంతో సుందర రాముడిగా బాలరాముడు దర్శనమిచ్చాడు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడటంతో.. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులంతా పులకించిపోయారు..

- Advertisement -

Also Read : శ్రీరామనవమి రోజున ఈ వ్రతం చేస్తే.. ఎంతో పుణ్యఫలం లభిస్తుంది

- Advertisement -

అయోధ్య రామమందిర ట్రస్టు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఈ దృశ్యం ఆవిష్కృతమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా లెన్స్, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలను రూపొందించారు. ఆలయంలోని మూడవ అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహంపై నేరుగా పడనున్నాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్ ను వాడలేదని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. చంద్రమాన తిథికి అనుగుణంగా.. రామనవమి రోజున ఒకేస్థానంలో ప్రసరించేలా చేశారు.

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి. మధ్యాహ్నం సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు చలువ పందిళ్లలో రాములవారి కల్యాణాన్ని కన్నులారా తిలకిస్తున్నారు. భద్రాచలం మిథిలా స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు కల్యాణం జరగనుండగా.. ఈసీ, అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News