Big Stories

HMD Smartphone: భారత్‌లో త్వరలో విడుదల కానున్న తొలి HMD బ్రాండెడ్ ఫోన్.. స్పెసిఫికేషన్స్, ప్రైజ్ డీటెయిల్స్..!

HMD Smartphone: హెచ్ఎండీ (HMD) బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు త్వరలో భారతదేశంలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం తెలిపింది. అయితే ఎప్పుడు లాంచ్ చేస్తుంది అని విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మొబైల్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో హెచ్‌ఎండీ సంస్థ తన మొబైల్‌ ఫోన్లను ప్రదర్శించింది. దీంతో ఫోన్ లుక్, డిజైన్, స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మధ్యలో HMG బ్రాండింగ్‌తో క్లీన్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది దాని లుక్‌తో ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేసింది.

- Advertisement -

ఈ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాల విషయానికొస్తే.. ఇది HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫ్లాట్ అంచులతో పంచ్-హోల్ ప్యానెల్ అవుతుంది. చూడ్డానికి చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది. ఇది కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లను కలిగి ఉంటుంది. ఎడమ వైపున సిమ్ కార్డ్ స్లాట్‌ను అమర్చారు. ఆప్టిక్స్ పరంగా.. ఇది డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ప్రధాన లెన్స్ 13MP ప్రైమరీ లెన్స్ అని తెలుస్తోంది. కాగా ఇది ఎంట్రీ-లెవల్ ఫోన్ కావచ్చని కొందరు టెక్ నిపుణులు సూచిస్తుంది. ఇది కెమెరా లెన్స్‌ల పక్కన డ్యూయల్-LED ఫ్లాష్‌ను కలిగి ఉన్నట్లు కూడా కనిపిస్తుంది.

HMD branded phone
HMD branded phone

Also Read: మోటో నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి!

అలాగే ఇది ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ ప్యాక్‌తో రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది నోకియా-బ్రాండెడ్ ఫోన్‌లతో పాటు HMD-బ్రాండెడ్ మొబైళ్లను కూడా లాంచ్ చేస్తుంది. అయితే ఈ HMD స్మార్ట్‌ఫోన్లు మిడ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు వరుసగా.. రూ.12,000 నుంచి రూ.18,000 వరకు ఉండవచ్చు. లేదా రూ.20,000 మధ్య ఉండే అవకాశం ఉందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News