కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీ ధరలు తగ్గించిన నేపథ్యంలో ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జీఎస్టీ సవరణలకు అనుగుణంగా ధరలను తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అందులో భాగంగా రైళ్లలో IRCTC అందించే రైల్ నీర్(వాటర్ బాటిల్) ధరలను తగ్గించింది. దేశ వ్యాప్తంగా ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
ఇకపై రైళ్లలో లభించే రైల్ నీర్ వాటర్ బాటిళ్ల ధర గతంతో పోల్చితే మరింత చౌకగా లభించనుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా నీటి ధరలను తగ్గిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. GST తగ్గింపు నుంచి వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చడానికి, రైల్ నీర్ వాటర్ బాటిళ్ల గరిష్ట అమ్మకపు ధరను 1 లీటరుకు రూ. 15 నుంచి రూ. 14 కు తగ్గించినట్లు తెలిపింది. అటు అర లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 10 నుంచి రూ. 9కి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటన జారీ చేసింది. ఈ ధరల తగ్గింపు ఈ నెల(సెప్టెంబర్ 22) నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
GST कम किये जाने का सीधा लाभ उपभोक्ताओं को पहुंचाने के उद्देश्य से रेल नीर का अधिकतम बिक्री मूल्य 1 लीटर के लिए ₹15 से कम करके 14 रुपए और आधा लीटर के लिए ₹10 से कम करके ₹9 करने का निर्णय लिया गया है। @IRCTCofficial #NextGenGST pic.twitter.com/GcMV8NQRrm
— Ministry of Railways (@RailMinIndia) September 20, 2025
Read Also: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..
అటు భారతీయ రైల్వే వాటర్ బాటిళ్ల ధరలను తగ్గించాలని నిర్ణయించడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సేవలపైనా ధరలు తగ్గించాలని కోరుతున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో అమ్మే వస్తువులకు సంబంధించి కచ్చితంగా ఎమ్మార్పీని పాటించాలని రైల్వే సూచించింది. ఎక్కువ ధరలకు విక్రయించే దుకాణదారులు, వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. రైల్వే నిబంధనలకు కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.
Read Also: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?