E-Paper
Advertisement

Bedroom Mirror : బెడ్ రూంలో పెద్ద అద్దం పెట్టారా…అయితే….

Bedroom Mirror : బెడ్ రూంలో పెద్ద అద్దం పెట్టారా…అయితే….
Advertisement

Bedroom Mirror : వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించిన పడక గది వల్ల ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. పడగ గది ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడి, చిరాకు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి పడక గది కొరకు వాస్తు దోహదపడుతుంది. ఒక గదిని నిర్మించేటప్పుడు వాస్తు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది.ఇంట్లో ఉండే కొన్ని వ‌స్తువులు అదృష్టాన్ని, ఐశ్వ‌ర్యాన్ని ఇస్తాయి. అలాగే అవే వ‌స్తువులు పెట్ట‌కూడ‌ని చోట పెడితే అవి ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తుల‌ను విడుద‌ల చేస్తాయ‌ని అంటున్నారు .

వాస్తు ప్రకారం పడకగదిలో అద్దాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ప‌డ‌క గ‌దిలో అద్దం అమ‌ర్చ‌డం మంచిది కాద‌ని వారు చెబుతున్నారు. ప్ర‌త్యేకించి ఈ అద్దం క‌నుక బెడ్ ను ప్ర‌తిబించించే విధంగా ఉంటే అస్స‌లు మంచిది కాద‌ని వారంటున్నారు. దాని వ‌ల్ల నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చిక్కుల్లో ప‌డే అవ‌కాశం ఉంది.

Advertisement

మూడో వ్య‌క్తి జోక్యంతో వైవాహిక జీవితం అస్థ‌వ్య‌స్థంగా మారే అవ‌కాశం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి అద్దాన్ని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడ‌దు. అలాగే ప‌డ‌క‌గ‌దిలో టీవీని పెట్టుకోవ‌డం మంచిది కాద‌ట‌. ఇది కూడా అద్దంలాగే ప్ర‌తికూల వ‌స్తువు. క‌నుక ప‌డ‌క‌గ‌దిలో బెడ్ ను ప్ర‌తిబింబించేట‌ట్టుగా ఉండే అద్దాన్ని తొల‌గించి వేరే స్థానంలోకి మార్చాలి లేదా అద్దం పై ఒక తెరను వేయాలి. ఈ చిట్కాను పాటించి వైవాహిక జీవితాన్ని ఆనంద‌మ‌యంగా మార్చుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అద్దాలు ఏర్పాటు చేయాల్సి వస్తే ఉత్తరం, తూర్పు, పడమర దిశల్లో మాత్రమే అద్దాలు ఏర్పాటు చేసుకోవాలి.

అలాగే పడకగదిలో అక్వేరియం లేదా మొక్కల్ని పెట్టకూడదు. బెడ్ రూంలో ఎంతో సరళమైన కాంతిని ఇచ్చే దీపాలను పెట్టండి. పడక గది మూల కిటికి లేదా ప్రవేశ మార్గం ఉండాలి, సానుకూల శక్తి ప్రవేశించి, వ్యతిరేక శక్తులను పారద్రోలేందుకు ఇది దోహదపడుతుంది. అత్యంత అనుకూలమైన దిశలో తలను పెట్టి నిద్రించాలని వాస్తు సలహా ఇస్తుంది. అలాగే బెడ్ రూంలో గదికి వేసే రంగులు కూడా ముఖ్యమైనవే.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×