Bhogi Wishes 2025: మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరం అవుతాడు. దీంతో భూమిపై చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం మండే మంటలను వేసుకునేవారు. భగ భగ మండే మండే మంటలను వేయడం వల్ల భోగి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ భోగి పండగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులు ఆత్మీయులకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయండి.
1.భోగి పండగ అందరి జీవితాల్లో
భోగభాగ్యాలతో పాటుగా సుఖ సంతోషాలను
అందించాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యలకు భోగి పండగ శుభాకాంక్షలు
2.భోగి భోగభాగ్యాలతో
సంక్రాంతి సిరిసంపదలతో
కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
3.భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ,
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
4.భోగి మంటలు మీ జీవితంలోని
అశాంతిని తొలగించి భోగభాగ్యాలతో నింపాలని ..
సంక్రాంతికి సరికొత్త వెలుగులను ఇవ్వాలని..
కనుమ కమనీయమైన ఆనందాలను కలగజేయాని
భగవంతున్ని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
5. మీ కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి
కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
6. కష్టాలను దహించే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పండ్లు
అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు
ధాన్యపు రాసులతో నిండిన వాకిళ్లు
ముంగిల్లో అందమైన రంగవల్లులు
ఘుబఘుమలాడే పిండి వంటలు
అందరికీ భోగి శుభాకాంక్షలు
7. భోగి పండగ సందర్భంగా మీకు అద్భుతమైన ఆరోగ్యం
శ్రేయస్సు కలగడంతో పాటు మీ జీవితం విజయాలతో,
ఆనందంతోనూ నిండాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు
8. తరిగిపోని ధాన్యారాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో..
తిరుగులేని అనుబంధాల అల్లికలతో..
మీ జీవితం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ
భోగి శుభాకాంక్షలు
9.ఇంటికొచ్చే పాడిపంటలు కమ్మనైన పిండివంటలు
చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు,
ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు