Ram Charan : ఎవరు ఎన్ని చెప్పినా… శంకర్ – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ మిక్సిడ్ టాక్ తెచ్చుకుంటుంది అనేది మాత్రం నిజం. మెగా ఫ్యాన్స్ కూడా ఇలాంటి మూవీని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు డే 1 కలెక్షన్లు 186 కోట్లు వచ్చాయని పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీనిపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. డిజైనర్‌కి 86 కోట్లు అని చెప్పబోయే 186 కోట్లు అని చెప్పారా..? అంటూ కామెంట్ చేస్తున్నారు.
మెగా ఫ్యాన్స్ కూడా ఆ సినిమానే కాదు.. ఈ 186 కోట్లు అనే నెంబర్‌ను కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇక గేమ్ ఛేంజర్ పక్కన పెడితే చరణ్‌కు మరో రెండేళ్ల పాటు ఇలానే ఉండేలా ఉంది. దీన్ని ఫ్యాన్స్ కూడా భరించాలి. ఈ రెండేళ్లు ఏంటి..? ఫ్యాన్స్ ఏం భరించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. అది రామ్ చరణ్ క్రియేట్ చేసింది కాదు. ఆయన ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ కంటే.. చరణే బెటర్, మంచి ఫర్ఫామెన్స్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేశారు. అంతే కాదు.. తారక్‌ను కించపరిస్తూ కూడా కామెంట్స్ చేశారు.
తర్వాత పుష్ప 2 టైంలో అల్లు అర్జున్ పై చరణ్ ఫ్యాన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. దీని వల్ల చరణ్ నుంచి ఫర్పామెన్స్ అనేది తారక్, బన్నీని బీట్ అయ్యేలా ఉండాలి. ఒక ఫర్ఫామెన్స్ మాత్రమే కాదు, సినిమా, కలెక్షన్లు అన్నీ కూడా ఆ రేంజ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా రామ్ చరణ్ తనకు తెలియకుండానే ఓ రకమైన పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. దీని వల్ల సినిమా రిలీజ్ అవ్వకముందే… ఆయన ముందు కొన్ని టార్గెట్స్ ఏర్పాడ్డాయి.
ఇలాంటి టైంలో చరణ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. ఇతర హీరోలకు ధీటుగా ఉండాలి ఆయన సినిమాలు. కానీ, రామ్ చరణ్ ప్రస్తుత లైనప్ చూస్తే తర్వాత వచ్చే మూవీ RC16. దీన్ని ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు.
ఈ బుచ్చిబాబు ఇప్పటి వరకు చేసిన మూవీ ఒక్కటే. అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా… అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి.
రామ్ చరణ్ ను బుచ్చిబాబు హ్యాండిల్ చేయగలడా…?
అలాగే 300 కోట్ల బడ్జెట్‌తో సినిమా ఎలా చేయగలడు..?
Rc16 మూవీ ఓ బయోపిక్ అని అంటున్నారు. బయోపిక్‌లను తెరకెక్కించడం అనేది పెను సవాళ్లతో కూడుకున్నది. మరి పెద్దగా ఎక్స్ పీరియన్స్ లేని ఈ డైరెక్టర్ బయోపిక్‌ను ఆడియన్స్ మెప్పించేలా చేయగలడా.??
ఇలాంటి డౌట్స్ ఉన్నాయి.
ఉప్పెన హిట్ అయింది కదా… బుచ్చిబాబు మీద నమ్మకం పెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు. అయితే ఉప్పెన సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు వస్తున్న RC16 సబ్జెక్ట్ వేరు అందులోనూ బయోపిక్ అంటున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి మూవీ వచ్చిన తర్వాత రామ్ చరణ్ ప్రయోగాలు కాకుండా.. పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అన్నీ సెట్ అవుతాయి.
అలా కాకుండా… ఈ ప్రయోగాత్మకమైన మూవీ రిలీజ్ అయితే… ఈ RC16 తర్వాత వచ్చే RC17 మూవీ వరకు ఆగాల్సిందే. RC17 మూవీని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.