BigTV English

Dhanteras: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

Dhanteras: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

Dhanteras: ధన త్రయోదశి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. ధన త్రయోదశి నాడు కొన్ని రకాల వస్తువులు కొంటే ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఈ ఏడాది అక్టోబర్ 29న దన త్రయోదశి వచ్చింది. ఆరోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆమె శక్తిని, ఆశీర్వాదాలను మీరు పొందవచ్చు. ధన త్రయోదశి పేరు చెప్పగానే అందరూ వెండి, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రమే కొనాలేమో అనుకుంటారు. అదే కాదు ఇతర వస్తువులను కొనడం ద్వారా కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.


తమలపాకులు
తన త్రమోదశినాడు ఐదు తమలపాకులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి, అవి ఎంతో శుభాన్ని కలుగ చేస్తాయి. ఈ ఆకులు తాజాగా, స్వచ్ఛంగా ఉంటాయి. హిందూ ఆచారాల ప్రకారం పూజలలో తమలపాకును కచ్చితంగా వాడుతారు. చాలా ఇళ్లల్లో దీపావళి పూజలో గణేశుడికి, లక్ష్మీదేవికి తమలపాకులను సమర్పిస్తారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఈ ఐదు ప్రకృతి మూలకాలను సూచించేలా ఐదు తమలపాకులను కొని ధన త్రయోదశి నాడు అమ్మవారికి పెట్టి పూజించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.

లక్ష్మీ గణేశుడు విగ్రహం
ధన త్రయోదశి నాడు కచ్చితంగా కొనాల్సిన వాటిలో లక్ష్మీ గణేష్ విగ్రహం ఒకటి. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సును అందిస్తే గణేశుడు ఆ భక్తుల మార్గంలోని అడ్డంకులను తొలగిస్తాడు. కాబట్టి లక్ష్మీదేవి గణేశుడిని కలిపి పూజిస్తే ఎంతో మేలు జరుగుతుంది. మీకు ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, ప్రశాంతమైన జీవితం దక్కుతుంది. కాబట్టి ఆ రోజు లక్ష్మీ గణేశుల విగ్రహాన్ని కలిపి ఒకేసారి కొనండి. మీకు ఎంతో మేలు జరుగుతుంది.


లక్ష్మీదేవి పాదముద్రలు
దీపావళి రోజున వీటిని కొంటె ఎంతో మంచిది. ధన త్రయోదశి రోజు కొన్నా కూడా మీకు మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి పాదముద్రలను స్టిక్కర్ల రూపంలో అమ్ముతారు. వాటిని కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉంచండి. బంగారం లేదా వెండి రూపంలో ఉన్న పాదాలను కొన్నా మంచిదే. ఈ చిన్న పాదముద్రలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి. మీ గుడిలో వీటిని పెట్టి పూజించండి. ఇది ఎంతో మేలు జరుగుతుంది.

చీపురు
ఇంటిని శుభ్రపరిచే చీపురును చాలామంది కాలితో తొక్కడం వంటివి చేస్తారు. నిజానికి చీపురు మనకి సకల సౌభాగ్యాలను అందించే దేవతతో సమానం. ధన త్రయోదశినాడు కచ్చితంగా కొనాల్సిన వాటిల్లో చీపురు ఒకటి. చీపురు ఇంట్లోని ప్రతికూల శక్తిని పేదరికాన్ని అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. చీపురు కొంటే ఇంట్లో సానుకూలత, శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. మహాలక్ష్మిని ఆహ్వానించడానికి మీరు కొత్త చీపురును ధన త్రయోదశి నాడు కొనండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. పాత చీపురును పడేసి కొత్త చీపురును ధన త్రయోదశి నాడు వాడడం మొదలుపెడితే మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది.

ఉప్పు
వంట గదిలో ఉప్పు ఉండడం చాలా ముఖ్యం. అలాగే ధన త్రయోదశినాడు ఉప్పును కొనడం వల్ల కూడా మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉప్పు ప్యాకెట్ ఉన్నప్పటికీ కూడా ధన త్రయోదశి నాడు కచ్చితంగా ఉప్పు కొనేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ కొనడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. ఉప్పు ప్రతికూల శక్తులను ఇంటి నుంచి దూరంగా ఉంచుతుంది. ఉప్పు అనేది స్వచ్ఛతకు చిహ్నం. మీ ఇంటి గుమ్మం దగ్గర ఉప్పును పోయడం వల్ల ఇలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ రోజు కళ్ళుప్పు లేదా రాతి ఉప్పును కొనడానికి ప్రయత్నించండి. ధన త్రయోదశి నాడు ఇది మీకు ఎంతో కలిసొచ్చేలా చేస్తుంది. బంగారం వెండి మాత్రమే కాదు పైన చెప్పినా వస్తువులను కొనడం వల్ల కూడా ధన త్రయోదశి నాడు మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×