Gun Powder: ఇడ్లీలోకి పచ్చడి ఉన్నా పక్కన ఏదైనా కారంపొడి ఉండాల్సిందే. ఇడ్లీలో, దోశల్లో గన్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ పొడి అని కూడా పిలుస్తారు. ఇడ్లీ, దోశలనే బ్రేక్ ఫాస్టుగా తినే వారి సంఖ్య ఎక్కువ. వీటిని తినేటప్పుడు పచ్చడితో పాటు పక్కన ఏదైనా కారంపొడి ఉండాల్సిందే. అలాంటి కారంపొడిలో గన్ పౌడర్ ఎంతో ఫేమస్. దీన్ని ఇడ్లీ పొడి అని కూడా పిలుచుకుంటారు. ఇంట్లోనే దీన్ని తయారు చేస్తే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే ఇంటిల్లిపాది నెల పాటు వాడుకోవచ్చు. దీని రెసిపీ చాలా సులువు. గన్ పౌడర్ ఎలా చేయాలో తెలుసుకోండి.
గన్ పౌడర్‌కు కావలసిన పదార్థాలు
కరివేపాకులు – గుప్పెడు
బియ్యము – రెండు స్పూన్లు
మిరియాలు – రెండు స్పూన్లు
మినపప్పు – రెండు స్పూన్లు
శనగపప్పు – నాలుగు స్పూన్లు
ఎండుమిర్చి – 50 గ్రాములు
నువ్వులు – రెండు స్పూన్లు
కొబ్బరిపొడి – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
గన్ పౌడర్ రెసిపీ
❂ గన్ పౌడర్ తక్కువ మొత్తంలో సింపుల్ గా ఎలా చేయాలో చెప్పాము.
❂ మీకు ఎక్కువ కావాలంటే అంత క్వాంటిటీకి అన్నింటిని రెట్టింపు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది.
❂ ఇడ్లీలపై గన్ పౌడర్ చల్లి తింటే రుచి అదిరిపోతుంది.
❂ ఈ గన్ పౌడర్ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టండి అందులో ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించండి.
❂ ఆ తర్వాత బియ్యం, నువ్వులు వేయండి.
❂ ఆ వెంటనే కరివేపాకులు, మిరియాలు, కొబ్బరి పొడి కూడా వేసి బాగా వేయించండి.
❂ వీటిని వేయించాక స్టవ్ ఆఫ్ చేయండి.
❂ వేడి తగ్గాక ఈ మొత్తం దినుసులను మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి చేయండి.
❂ అంతే టేస్టీ గన్ పౌడర్ రెడీ అయినట్టే. దీన్ని గాలి చొరబడని కంటైనర్ లో వేసి దాచుకుంటే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది.
❂ అదే ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది.
❂ పక్కన చట్నీ లేకపోయినా ఈ పొడి వేసుకొని తినేయవచ్చు.
ఈ గన్ పౌడర్ ను ఇడ్లీ పొడి అని కూడా పిలుచుకుంటారు. ఈ ఇడ్లీ పొడిలో నెయ్యిని కలుపుకొని ఇడ్లీని ముంచుకొని తింటే ఆ రుచే వేరు. అలాగే దోశలో వేస్తున్నప్పుడు పైన ఈ గన్ పౌడర్‌ను చల్లుకోండి. ఉప్మా తో కూడా ఈ గన్ పౌడర్ మిక్స్ చేయడం రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ ఇడ్లీ పొడి చేసుకొని చూడండి. మీకే దాని రుచి అర్థం అవుతుంది.