Akshaya Tritiya 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం.. అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పుణ్య స్నానం, దానాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బంగారం కొనడం కొత్త పనులను ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే.. అనేక రెట్లు ఎక్కువ ప్రయోజనాలను అందుతాయని అంతే కాకుండా లక్ష్మీ దేవి ఆశీస్సులను కురిపిస్తుందని, శాశ్వతమైన ఫలాలను అందిస్తుందని నమ్ముతారు.
బంగారం అందరికీ ఇష్టం. కానీ పెరుగుతున్న బంగారం ధరలు అందరి బడ్జెట్‌కి సరిపోవు. కాబట్టి మీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకపోతే అస్సలు బాధపడకండి. అక్షయ తృతీయ నాడు వీటిని ఇంటికి తీసుకువస్తే మీకు బంగారం లభిస్తుందని గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ వస్తువులు కొనడం వల్ల బంగారం కొన్నట్లే శుభ ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే ఈ వస్తువులు లక్ష్మీ దేవితో ముడిపడి ఉంటాయి. అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే.. బంగారం కొన్నంత ప్రయోజనాలు మీకు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజు బంగారం బదులుగా ఎలాంటి వస్తువులను కొనవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ షాపింగ్ సమయం- ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 02:12 వరకు
ఈ వస్తువులు బంగారం లాగే పవిత్రమైనవి:
వెండి నాణెం:
మీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకపోతే వెండి నాణెం కూడా కొనవచ్చు. శుభం కోసం, లక్ష్మీ దేవి చిత్రం ముద్రించబడిన వెండి నాణెం కొనండి. అక్షయ తృతీయ నాడు ఈ నాణెంను పూజలో సమర్పించి, ఆపై దానిని పూజగదిలో ఉంచండి. దీని వలన మీకు సంపద అదృష్టం పెరుగుతాయి.
గవ్వలు:
అక్షయ తృతీయ నాడు గవ్వలు కొనడం బంగారం కొన్నంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనికి కారణం తల్లి లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. గవ్వలు కొన్న తర్వాత, అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవికి సమర్పించి, ఎర్రటి గుడ్డలో కట్టి పూజగదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.
బార్లీ :
బార్లీని భూమి తల్లి ఇచ్చిన మొదటి ఆహారంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బార్లీ కొన్నా.. బంగారం కొనడం వల్ల మీకు లభించే పుణ్యం సమానం అవుతుంది. బార్లీ కొన్న తర్వాత.. దానిని మీరు లక్ష్మీ దేవికి సమర్పించండి. దీని వల్ల మీకు అదృష్టం కలుగుతుంది.
అక్షయ తృతీయ ఎందుకు పవిత్రమైనది ?
హిందూ మతంలో.. అక్షయ తృతీయను శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు పవిత్రత , దైవత్వం కారణంగా అనేక దేవాలయాల తలుపులు కూడా తెరుచుకుంటాయి. నాలుగు ధామాలలో ఒకటైన బద్రీనాథ్ తలుపులు కూడా అక్షయ తృతీయ రోజున తెరుచుకుంటాయి. బృందావనంలో ఈ రోజున బాంకే బిహారీ పాదాల దర్శనం కూడా జరుగుతుంది.
Also Read: అక్షయ తృతీయ రోజు 3 అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం
అక్షయ తృతీయ నాడు శ్రీమహావిష్ణువు నర నారాయణుడు, నరసింహుడు, హయగ్రీవుడు , పరశురాముడు అవతారాలు తీసుకున్నాడని మత విశ్వాసం. ఈ తేదీన గంగా దేవి భూమిపైకి వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ప్రారంభం కూడా ఈ తేదీ నుండి లెక్కించబడుతుందని అంటారు.