BigTV English

Craze for IPL: PSL ఇజ్జత్ తీస్తున్న పాక్ ఫ్యాన్స్..గ్రౌండ్ లోనే IPL చూస్తున్నారు !

Craze for IPL:  PSL ఇజ్జత్ తీస్తున్న పాక్ ఫ్యాన్స్..గ్రౌండ్ లోనే IPL చూస్తున్నారు !

Craze for IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో…. పాకిస్తాన్ పరువు గంగలో కలుస్తోంది. ఈ టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభించారు. దీంతో… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు అడుగడుగునా… ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆ టోర్నమెంట్ చూసే నాధుడే కనిపించడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వైపే… క్రికెట్ అభిమానులు మొగ్గుచూపుతున్నారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చూసే నాధుడే కరువయ్యాడు.


Also Read:  Ispl t10 League : ఇదెక్కడి ఫీల్డింగ్ రా… ఈ వీడియో చూస్తే నవ్వు ఒప్పుకోలేరు

అయితే తాజాగా ఓ సంఘటన.. పాకిస్తాన్ పరువు మరోసారి తీసింది. పాకిస్తాన్ అభిమానులే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను లేపుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా తాజాగా ఓ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు…. బోర్ గా ఫీల్ అయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో క్రికెటర్లు పెద్దగా ఆడటం లేదని… అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వెంటనే… మొబైల్ తీసుకొని… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ ను తిలకించారు.


పాకిస్తాన్ సూపర్ లీగ్ చూడకుండా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించిన మ్యాచ్ లు తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు అలాగే ఇండియన్స్… దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ను పట్టించుకునే వాడే లేడా అంటూ… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ గ్రౌండ్లో ఐపీఎల్ చూసిన వాడిని జైల్లో వేయండిరా అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Also Read:  Trolls on RCB: 18 ఏళ్ళు వచ్చాయి.. ఒక్క కప్పు లేదు…RCB పై దారుణంగా ట్రోలింగ్

ఇక మరి కొంతమంది పాకిస్తాన్ సూపర్ లీగ్ బోర్ కొట్టినట్టు ఉంది… అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ చూస్తున్నారు… అందులో తప్పేమీ లేదని అంటున్నారు. ప్రౌడ్ అఫ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ పరువును.. పాకిస్తాన్ ఫ్యాన్స్ గంగలో కలుపుతున్నారని కూడా.. సెటైర్లు పేల్చుతున్నారు. ఇక మొన్నటికి మొన్న… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో.. బాగా ఆడిన ప్లేయర్లకు ట్రిమ్మర్లు అలాగే హెయిర్ డ్రాయర్లు ఇవ్వడం కూడా వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ గ్రౌండ్ లోనే ఐపిఎల్ మ్యాచ్ లు చూసిన సంఘటన తెరపైకి వచ్చింది. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మెగా వేలంలో అమ్ముడు పోనీ ప్లేయర్ లందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వెళ్లారు. డేవిడ్ వార్నర్, డారీల్ మిచల్, కేన్ మామ లాంటి ప్లేయర్ లందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు వెళ్లారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×