OnePlus 13 Mini: వన్ ప్లస్ అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ మొబైల్ ను త్వరలో లాంచ్ చేయనుంది. అతి తక్కువ వెయిట్ తో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కలిగిన స్మార్ట్ మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ కు మంచి పేరు పెట్టేే యోచనలో కంపెనీ యాజమాన్యం ఉంది. ఈ స్మార్ట్ డివైజ్‌కు ‘వన్ ప్లస్ 13 మినీ’ అని పేరు పెట్టాలనే యోచనలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ కోసం విక్రయించేందుకు వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. వన్ ప్లస్ 13, 13Rలతో కూడిన సిరీస్ ను ప్రారంభించిన తర్వాత, 2025లో నూతన కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ ను విడుదల చేయనుంది.
ALSO READ: TGPSC Group-1,2,3 Exams: ఈ ఏడాది మళ్లీ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు.. ఈ తప్పులు చేయకండి..
మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ డివైజ్ ను ఏప్రిల్ నెలలో లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొబైల్ పరిమాణం చిన్నగా ఉండొచ్చని.. అయినప్పటికీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందట.
వన్ ప్లస్ 13 మినీ స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల స్క్రీన్ తో 6000mAh బ్యాటరీ కెపాసిటీతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఫోన్ లాంచ్ చేసే అవకాశ ఉంది. అంటే ఎక్కువ శాతం ఏప్రిల్ నెలలో మొబైల్ ను లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ALSO READ: CBI Recruitment: సీబీఐలో 1000 ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్ మిత్రమా..!
అయితే, వన్ ప్లస్, ఒప్పో హ్యాండ్ సెట్‌లు ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఈ స్మార్ట్ మొబైల్ లు కూడా 6500mAh, 7000mAh భారీ స్టోరేజీతో లాంచ్ చేయనున్నారు. ఫోన్ పరిమాణం, లెంగ్త్ పెంచకుండా 6000mAh లేదా 6500mAh స్టోరేజీ కలిగిన బ్యాటరీ తయారు చేయడానికి సిలికాన్ కార్బన్ యానోడ్ ను ఉపయోగిస్తున్నారు. చైనీస్ ఓఈఎమ్ ల కారణంగా పెద్ద బ్యాటరీ లను రూపొందించడానికి ఎక్కువ కృషి చేయడంతో ఇది సాధ్యమైంది.