BigTV English

Payel Mukherjee: హీరోయిన్ పాయల్ పై దాడి.. నడిరోడ్డుపై కారును ఆపి..

Payel Mukherjee: హీరోయిన్ పాయల్ పై దాడి.. నడిరోడ్డుపై కారును ఆపి..

Payel Mukherjee: బెంగాలీ నటి పాయల్ ముఖర్జీపై దాడి జరిగింది. నడిరోడ్డుపై ఆమె కారు ఆపి.. ఒక బైకర్ దాడికి పాల్పడ్డాడు. దాంతో బెదిరిపోయిన  పాయల్ .. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. అనంతరం అక్కడ జరిగిన  ఘటనను మొత్తం సోషల్ మీడియాలో  లైవ్ స్ట్రీమింగ్ చేసి, తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇదేనా ఇండియాలో మహిళలకు ఉన్న భద్రత అంటూ కన్నీటీ పర్యంతమయ్యింది. అసలు ఇంతకు పాయల్ ఎవరు.. ? ఏం చేసింది.. ? ఎందుకు అతను  పాయల్ పై దాడి చేశాడు.. ? అనేది  తెలుసుకుందాం.


పాయల్ ముఖర్జీ ఒక బెంగాల్ నటి.  తెలుగులో కూడా ఈ చిన్నది ఒక సినిమా చేసింది. అదే శ్రీరంగాపురం. చిన్న సినిమాగా రిలీజ్ అవ్వడంతో ఎవరికి ఆమె అంతగా పరిచయం కాలేకపోయింది.  తమిళ్ లో కూడా  మంచి మంచి సినిమాల్లో నటించిన పాయల్.. ఈ మధ్యనే కోల్ కత్తా డాక్టర్ రేప్ అండ్ మర్డర్  కేసుకు సపోర్ట్ గా నిలబడింది.

సోషల్ మీడియాలో నిందితులను ఏకిపారేసింది.  డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేసింది. ఇక ఆ ఒక్క కారణంతోనే ఆమెపై దాడికి పాల్పడినట్లు  పాయల్ చెప్పుకొచ్చింది. రోడ్డుపై  వెళ్తున్న కారును ఆపి, ఒక వ్యక్తి తనను బూతులు తిడుతూ.. కారు అద్దాలు పగలకొట్టి దాడికి ప్రయత్నించినట్లు ఆమె తెలిపింది.


” ముంబైలో చుట్టూ జనాలు తిరుగుతున్న స్థలంలో ఒక మహిళపై క్రూరంగా  దాడి జరిగిందంటే .. మహిళలకు ఎలాంటి భద్రత ఉందో మీరే ఊహించండి” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  ఇక ఈ వీడియోపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×