Holi 2025: హోలీ పండుగ రోజు దేశ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటుతాయి. రంగుల పండుగను చిన్నా, పెద్దా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీని భారత్ తో పాటు పలు దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. హోలీ నాడు బంధుమిత్రులు అంతా కలిసి రంగులు పూసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో చక్కగా ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటారు. బ్యాండు దరువులకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ యువతీ, యువకులు హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. అయితే, దేశ వ్యాప్తంగా ఘనం జరుపుకునే ఈ హోలీ పండుగకు కొన్ని ప్రాంతాల ప్రజలు దూరంగా ఉంటారు. హోలీ రోజులన ఈ ప్రాంతాల్లో కనీసం రంగులు కూడా లభించవు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకీ ఎందుకు వాళ్లు హోలీని జరుపుకోరు? ఎప్పటి నుంచి హోలీకి దూరంగా ఉంటున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ దుర్గాపూర్, జార్ఖండ్
జార్ఖండ్ రాష్ట్రంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగానే జరిగినా, దుర్గాపూర్ అనే గ్రామంలో రంగుల పండుగను జరుపుకోరు. రెండు శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు హోలీకి దూరంగా ఉంటున్నారు. హోలీ రోజున ఇక్కడ రాజ కుమారుడు చనిపోయినట్లు స్థానికులు చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ హోలీ జరపకూడదని నిర్ణయించారట. అప్పటి నుంచి ఈ గ్రామంలో హోలీ జరుపుకోరు. కానీ, ఈ పండుగ జరుపుకునేందుకు ఇక్కడి ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్తారు.
⦿ రామ్సన్, గుజరాత్
గుజరాత్ లోనూ ఓ గ్రామంలో హోలీ పండుగ జరుపుకోరు. బనస్కాంత జిల్లాలోని రామ్సన్ లో హోలీ వేడుకలు జరగవు. వందల ఏండ్ల క్రితం నుంచి ఇక్కడ హోలీ సంబురాలు లేవు. అప్పట్లో ఈ గ్రామంలో హోలీ జరుపుకుంటే చెడు జరుగుతుందని కొంత మంది సాధువులు శపించారట. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలు హోలీకి దూరం అయ్యారు.
⦿ తమిళనాడు
సౌత్ స్టేట్ తమిళనాడులోనూ హోలీ సంబురాలు పెద్దగా జరుపుకోరు. హోలీ రోజున తమిళనాడులో మాసి మాగం పండుగను జరుపుకుంటారు. స్థానికులు అంతా ఈ పండుగను జరుపుకునేందుకు మొగ్గు చూపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో హోలీ వేడులకు జరుపుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు.
Read Also: ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుకున్న అసలు కథ ఏంటి?
⦿ రుద్రప్రయాగ, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ లోని పలు గ్రామాలు హోలీ పండుగను జరపుకోవు. రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలు చాలా ఏండ్లుగా హోలీకి దూరంగా ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న త్రిపుర సుందరి దేవతకు శబ్దాన్ని ఇష్టపడదని ప్రజలు నమ్ముతారు. ఈ దేవత తమ మూడు గ్రామాలను కాపాడుతుందని భావిస్తారు. తమను రక్షించే దేవతకు శబ్దం కలిగించి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హోలీని జరపుకోరు. ఈ నాలుగు ప్రాంతాల్లో మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో హోలీని జరుపుకుంటారు.
Read Also: రంగు రాసి ముద్దు పెట్టబోయిన ప్రియుడు.. రెప్పపాటులో దవడ పగుల్స్!
Read Also: హోలీ కోసం స్పెషల్ వందేభారత్, ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తుందంటే?