హోలీ పండుగ దేశ వ్యాప్తంగా కన్నుల పండువగా జరపుకుంటారు. ఉత్తరం, దక్షిణం అనే తేడాలేకుండా, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగుల్లో మునిగిపోతారు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. హోలీ పండుగను హోళికా పూర్ణిమా, కాముని పున్నంగా పిలుస్తుంటారు. అసలు హోలీ పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హోలీ పండుగ ఎప్పుడు? ఎందుకు జరుపుకుంటారంటే?
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ముఖ్యమైన హిందూ పండుగ హోలీ. ఈ ఏడాది హోలీ పండుగా మార్చి 14న జరుపుకుంటున్నారు. హోలీ పండుగ గురించి హిందూ పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రహ్లాదుడు, అతడి అత్త హోళిక కథ చుట్టూ తిరుగుతుంది. హిరణ్య కశ్యపుడికి మహా విష్ణువు అంటే ఎంతో పగ. అతడి కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకు అపర భక్తుడు. అగ్నితో ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే వరాన్ని పొందిన హిరణ్య కశ్యపుడు సోదుడు హోళికతో ప్రహ్లాదుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయాలని ఆదేశిస్తాడు. కానీ, ఆ మంటల్లో హోళికా దహనం కాగా, ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. ఈ ఘటనకు గుర్తుగా హోళికా దహనం చేస్తారు.
హోలీ రోజున రంగులు ఎందుకు చల్లుకుంటారంటే?
హోలీ రోజున రంగులు చల్లుకోవడం వెనుక కూడా ఓ కథ ఉంది. అందమైన రాధను చూసి బాలకృష్ణుడు తను నల్లగా ఉన్నానని బాధపడుతాడు. దీంతో అతడి ముఖానికి రంగులు పూసి అందంగా తయారు చేస్తుంది యశోదమ్మ. అప్పటి నుంచి రంగులు పూసుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు అందరూ నమ్ముతారు.
హోళికా దహనం ప్రాముఖ్యత
హోళికా దహనం సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్తుంది.
చెడుపై మంచి విజయం: హోలీ పండుగ హోళికా నాశనం, ప్రహ్లాదుడి మనుగడను గుర్తుచేస్తుంది. ధర్మం, భక్తి చివరికి దుష్టత్వంపై విజయం సాధిస్తాయనే నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.
విశ్వాసం, భక్తి: ప్రాణాపయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, విష్ణువు పట్ల ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రేరణగా పని నిలుస్తుంది.
ఋతు పరివర్తన: హోళికా దహనం శీతాకాలం ముగింపు, వసంతకాలం ప్రారంభం మధ్యలో జరుగుతుంది. ఇది ప్రకృతిలో పునరుద్ధరణ, పునరుజ్జీవనం సమయం. ఇది కొత్త ప్రారంభాలను సూచిస్తుంది.
సామాజిక సామరస్యం: ఈ పండుగ సమాజంలోని ప్రజల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. రంగులు చల్లుకుంటూ ఆహ్లాదంగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు.
Read Also: హోలీ కోసం స్పెషల్ వందేభారత్, ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తుందంటే?
హోలీని ఎలా జరుపుకోవాలి?
హోలీ అంటే రంగుల పండుగ మాత్రమే కాదు. సంగీతం, నృత్యం, రుచికరమైన ఆహారం, సాంస్కృతిక వారసత్వం కూడా. హోలీని కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ప్రజలు సంగీతం, నృత్యం, రంగుల ఆటలతో హోలీని జరుపుకుంటారు. రంగులు పూసుకోవడంతో పాటు స్వీట్లు తినిపించుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
Read Also: రంగు రాసి ముద్దు పెట్టబోయిన ప్రియుడు.. రెప్పపాటులో దవడ పగుల్స్!