Nani VS Vijay Devarakonda: సినీ పరిశ్రమలో ఫ్యాన్ వార్స్ అనేవి సహజం. హీరోలు ఎంత సాన్నిహిత్యంతో, కలిసి మెలిసి ఉన్నా కూడా ఫ్యాన్సే ఎవరు గొప్ప అని గొడవలు మొదలుపెడతారు. ఇప్పుడు కాదు.. ఎన్‌టీఆర్, ఏఎన్నార్ కాలం నుండే ఈ ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. అలా ప్రతీ జెనరేషన్‌లో ఇద్దరు టాప్ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్ వార్స్ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఈ ఫ్యాన్ వార్స్ శృతిమించుతుంటాయి. అలా ఈ జెనరేషన్‌లో గొప్ప యాక్టర్ ఎవరు అని నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యింది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ నడుస్తోంది. ఇక తాజాగా ఈ ఫ్యాన్ వార్‌కు చెక్ పెట్టడం కోసం నాని, విజయ్ ఒక పనిచేశారు.
ఫ్యాన్ వార్స్
విజయ్ దేవరకొండ హీరోగా ఎంటర్ అయ్యే టైమ్‌కే నాని హీరోగా చాలా సినిమాలు చేశాడు. అదే సమయంలో వీరిద్దరూ కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వల్లే విజయ్ దేవరకొండకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. అప్పటివరకు పెద్దగా సినిమాలు చేయని విజయ్‌కు ఈ సినిమానే లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత విజయ్ కూడా హీరో అయ్యాడు. వరుసగా ఆఫర్లు వచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’తో ఏకంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు నానికి పోటీగా తన స్టార్‌డమ్ ఉంది కాబట్టి అందుకే ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ మొదలయ్యాయి.
పదేళ్ల తర్వాత
ఇటీవల నాని (Nani) హీరోగా నటించిన ‘హిట్ 3’, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ మూవీ టీజర్స్ రిలీజ్ అవ్వగానే ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యింది. నీ హీరో గొప్పా? నా హీరో గొప్పా? అనే చర్చలు మొదలయ్యాయి. నాని వర్సెస్ విజయ్ దేవరకొండ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇద్దరి మధ్య పోలికలు కూడా బయటపెట్టారు అభిమానులు. ఇక ఈ ఫ్యాన్ వార్‌కు చెక్ పెట్టడం కోసం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఒకే బైక్‌పై కూర్చొని అప్పటి పోస్టర్‌ను రీక్రియేట్ చేశారు. వీరిద్దరిని ఇలా చూస్తుంటే ఇక ఫ్యాన్స్ కూడా వార్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి పదేళ్ల తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ మళ్లీ రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది.
Also Read: మోసం చేసి పెళ్లి చేసుకుంది, అందుకే విడాకుల కోసం అలా.. నటిపై భర్త ఆరోపణలు
దర్శకుడిగా డెబ్యూ
2015 మార్చిలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాతోనే నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ప్రియాంక దత్, స్వప్న దత్ దీనిని నిర్మించారు. అప్పటివరకు వరుసగా ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న నానికి ఈ మూవీ కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికీ చాలామందికి ఈ మూవీ పర్సనల్ ఫేవరెట్‌గా నిలిచిపోయింది. ఇక ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధం కాగా నాని, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్.. ఇందులో ఒక ఐకానిక్ పోజ్‌ను రీక్రియేట్ చేశారు.