Holi Special Vande Bharat Express: ఈ హోలీ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హోలీకి స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ- పాట్నా మధ్య ప్రత్యేక వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ రైలు మార్చి 8 నుంచి మార్చి 21 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. న్యూఢిల్లీలో బయల్దేరే ఈ రైలు మార్గ మధ్యంలో కాన్పూర్, ప్రయాగ్ రాజ్, వారణాసి, బల్లియా, ఛప్రా, పాటలీపుత్ర జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది
హోలీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ వివరాలు
హోలీ స్పెషల్ వందే భారత్ రైలు 16 కోచ్ లను కలిగి ఉంటుంది. ఈ రైలు సోమవారం తప్ప ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి 10:30 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, ఈ రైలు మంగళవారం తప్ప ఉదయం 5:30 గంటలకు పాట్నా నుండి బయలుదేరి అదే రోజు రాత్రి 8:10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.
హోలీ పండుగ వేళ ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక వందే భారత్ సర్వీస్‌తో పాటు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా మరో 14 హోలీ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (మార్చి17), ఆనంద్ విహార్-రాజ్‌గిర్ స్పెషల్ (మార్చి 11, 14, 18) రైళ్లతో పాటు ఢిల్లీ-భాగల్పూర్, న్యూఢిల్లీ-గయా, ఆనంద్ విహార్-ముజఫర్ పూర్, యోగ నగరి రిషికేశ్-ముజఫర్ పూర్, న్యూఢిల్లీ-సహర్సా, ఆనంద్ విహార్-జోగ్బాని, ఆనంద్ విహార్-జయనగర్, ఆనంద్ విహార్-సీతామర్హి, అమృత్‌సర్-సహర్సా, సిర్హింద్-జయనగర్ మధ్య హోలీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది.
Read Also: ఇకపై టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ, రైల్వేశాఖ కీలక నిర్ణయం!
సౌత్ సెంట్రర్ రైల్వే పరిధిలోనూ హోలీ స్పెషల్ రైళ్లు
హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే సైలం పలు రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్ సర్వీస్ మార్చి 12, 16 తేదీలలో నడపనున్నట్లు వెల్లడించారు. అటు హజ్రత్ నిజాముద్దీన్ – చర్లపల్లి సర్వీస్ మార్చి 8, 14, 18 తేదీలలో నడుస్తాయన్నారు. అటు కాచిగూడ – మదార్ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. కాచిగూడ – మదార్ (07701) సర్వీస్ మార్చి 11, 16 తేదీలలో నడవనుంది. మదార్ – కాచిగూడ (07702) సర్వీస్ మార్చి 13, 18 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అటు చర్లపల్లి నుంచి షాలిమార్, సంత్రాగచ్చికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. హోలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్తు లేకపోతే, తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండేదంటున్నారు.
Read Also: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ ట్రైన్, ముహూర్తం ఫిక్స్ చేసిన ఇండియన్ రైల్వే!