BigTV English

Netanyahu House Attack: నెత్యన్యాహు ఇంటిపై డ్రోన్ అటాక్.. ‘ఇరాన్ తొత్తులు పెద్ద తప్పు చేశారు’

Netanyahu House Attack: నెత్యన్యాహు ఇంటిపై డ్రోన్ అటాక్.. ‘ఇరాన్ తొత్తులు పెద్ద తప్పు చేశారు’

Netanyahu House Attack| ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై శనివారం లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ నగరం సిజేరియాలోని ప్రధాని నివాసంలో నెతన్యాహు, ఆయన భార్య నివసిస్తారు. అయితే దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిపై ప్రధాన మంత్రి నెతన్యాహు స్పందించారు.


”నన్ను, నా భార్యను హత్య చేయడానికి ఇరాన్ తొత్తులు ప్రయత్నించారు. వారు చాలా పెద్ద చేశారని త్వరలోనే వారికి అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దేశ ప్రజలు తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ యుద్ధాన్ని ఇలాంటి దాడులు చేసి ఆపలేరు. నేను ఇరాన్, దాని తొత్తులకు ఒకటే చెబుతున్నా.. ఇజ్రాయెల్ పౌరులకు ఎవరైనా హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే.. చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహించే వారిని మట్టుపెట్టే చర్యలు ఆగవు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను మేము సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తాం. యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలను సాధిస్తుంది. ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు తరతరాలు కట్టుదిట్టంగా ఉండే విధంగా మార్పులు తీసుకువస్తాం. మేము కలిసి కట్టుగా పోరాడి, దైవకృపతో విజయం సాధిస్తాం,” అని నెతన్యాహు తీవ్ర పదజాలంతో ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Also Read: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన


మరోవైపు ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా మిలిటెంట్లు డజన్ల కొద్దీ రాకెట్ దాడులు చేశారని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఈ దాడుల్లో భాగంగానే ప్రధాని నివాసంపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడి చేసినట్లు హిజ్బుల్లా ఇంతవరకూ ప్రకటించలేదు.. కానీ ఉత్తర, సెంట్రల్ ఇజ్రాయెల్ భూభాగంతో చాలా క్షిపణి దాడులు చేసినట్లు అంగీకరించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయి.

మరోవైపు లెబనాన్ లోని దక్షిణ బేరుట్ లో ఇజ్రాయెల్ ఒకరోజులలో 10 క్షిపణి దాడులు చేసింది. దక్షిణ బేరుట్ లోని అత్యధిక జనాభా ఉన్న దహియె ప్రాంతంలో హిజ్బుల్లా ఆఫీసులుండడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెద్ద స్థాయిలో యుద్దం ప్రారంకాబోతున్నట్లు సూచనలు కనిపిస్తుండడంతో టర్కీ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్‌చీ మాట్లాడుతూ.. మిడిట్ ఈస్ట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే యుద్దం కోరుకున్నట్లు తెలుస్తోంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు.

Also Read: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’

శనివారం అక్టోబర్ 19, 2024న హిజ్బుల్లా మిలిటెంట్లు లెబనాన్ నుంచి దాదాపు 180 క్షిపణి దాడులు చేశారని ఇజ్రాయెల్ మిలిటరీ.. ఈ దాడుల్లో ఉత్తర్ ఇజ్రాయెల్ కు చెందిన ఒక 50 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ నగరం కిర్యాత్ అతాలో హిజ్బుల్ల రాకెట్ దాడుల కారణంగా 9 మంది గాయపడ్డారని సమాచారం.

మరోవైపు గాజాలోని ఒక ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యం చేసిన బాంబు దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఇజ్రాయెల్ యుద్ద నేరాలకు పాల్పడుతోందని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Related News

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

Big Stories

×