BigTV English

Naga Vamsi: ఇక పై రేంజ్ సినిమాలకి ఫుల్ పాజిటివ్ రివ్యూ వస్తుందని నమ్మకాలు నాకైతే లేవు

Naga Vamsi: ఇక పై రేంజ్ సినిమాలకి ఫుల్ పాజిటివ్ రివ్యూ వస్తుందని నమ్మకాలు నాకైతే లేవు

Naga Vamsi: తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఆ టాక్, ఆ రిజల్ట్ తెలిసేది. కానీ ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే దాన్ని చాలామంది రివ్యూ చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పేపర్లలో చూసి సినిమాకి సంబంధించిన రివ్యూ చదువుకునేవాళ్ళం. కానీ రీసెంట్ టైమ్స్ లో ట్విట్టర్ లోను యూట్యూబ్లోనూ సినిమా రివ్యూ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అంతేకాకుండా చాలామంది రివ్యూ చెప్పే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. వీటి గురించి నిర్మాత నాగ వంశీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.


సితార ఎంటర్టైర్మెంట్ పై నాగ వంశీ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నాగ వంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇక ప్రస్తుతం మీ బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. దుల్కర్ తో పాటుగా మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవి ప్రకాష్ ఏ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ టీజర్ కూడా చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన పాయింట్ ను ఈ సినిమాలో చూపిస్తున్నట్లు నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా, సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చే కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటాడు. ట్విట్టర్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు వంశీ. కొన్నిసార్లు చాలామందికి స్వయంగా సమాధానం కూడా చెబుతూ ఉంటాడు. అలానే కొన్ని కామెంట్స్ చేసి ట్విట్టర్లో వైరల్ గా మారుతుంటాడు. మామూలుగా చెప్పాలంటే వంశీ నిర్మాత కంటే ముందు ఒక నార్మల్ ఆడియన్. సినిమాను కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. అందుకే సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్లు వచ్చిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇకపోతే ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే దాని మీద చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది కామన్ అయిపోయింది.


దీని గురించి నాగ వంశీ మాట్లాడుతూ కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక పెద్ద సినిమా గురించి కంప్లీట్ పాజిటివ్ టాక్ వింటాను అని నమ్మకం నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాకు వంశీ డిస్ట్రిబ్యూట్ చేసిన దేవర, అలానే వాళ్ళ బ్యానర్ లో వచ్చిన గుంటూరు కారం వంటి సినిమాలకి మొదట నెగిటివ్ దాకా వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ రావటం వలన బ్రేక్ ఈవెన్ అయి మంచి కలెక్షన్ కూడా వచ్చాయి. ఇక రివ్యూవర్ గురించి మాట్లాడుతూ ఒక సినిమా బాగుంది అని చెప్తే మన రివ్యూ ఎవరూ చూడరు. ఆ బాగున్న సినిమాలో కూడా ఏదో ఒక లోపాన్ని చూపిస్తే ఆహా వీడెవడో తెలివైనవాడు అని వాడి మీద అటెన్షన్ కోసం ఏదో చెప్తుంటాడు అని చెప్పుకొచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×