BigTV English

Fortune of The House : ఇంటి అదృష్టాన్ని ఆ రెండు వస్తువులు డిసైడ్ చేస్తాయా….?

Fortune of The House : ఇంటి అదృష్టాన్ని ఆ రెండు వస్తువులు డిసైడ్ చేస్తాయా….?
fortune of the house


Fortune of The House : ఏ ఇంటికైనా అదృష్ట దేవత ఎవరో కాదు ఇంటి ఇల్లాలే . ఇంటి బాధ్యతలు చూసే యజమాని కన్నా యజమానురాలి భార్య చేతుల్లో అంతా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇంటిని ఇల్లాలు చక్కబెట్టుకునే విధానాన్ని బట్టి ఆ కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందో చెప్పవచ్చటోంది. ముఖ్యంగా కిచెన్ గదిలో కొన్ని వస్తువుల్ని వాడే తీరును బట్టి లక్ ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి పసుపు, ఉప్పు.
పసుపు సుమంగళానికి భావిస్తారు . ఉప్పును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూస్తుంటారు . ఈరెండింటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇంటి తలరాత మారుతుంది. లక్ష్మీదేవి స్థిరంగా, నిలకడగా ఉంటుంది. ఇంట్లో పసుపు, ఉప్పు లేకపోతే అయిపోయాయని చెప్పకూడదు. పసుపు కొనాలి, ఉప్పు తేవాలని మాత్రమే పదాలు వాడాలి. ఇలా మాట్లాడటం వల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

ఇంటి వంటగదిలో పసుపు, ఉప్పు డబ్బాలు పక్క పక్కనే ఉండకూడదు. రెండింటిని ఒక చోట కాకుండా వేర్వేరు చోట్ల పెట్టుకుంటే లక్ష్మీ దేవి కరుణిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఇలాంటి ఆచారాలు పద్దతులు చెబుతుంటారు. అలాగే చీకటి పడిన తర్వాత ఉప్పు బయట నుంచి తేకూడదు. కొనకూడదు. మెత్తటి ఉప్పు అయినా, గళ్ల ఉప్పు అయినా సాయంత్రం ఆరు లోపలే కొని ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత కొనుగోలు చేయకూడదు. పొరపాటున కింద పడ్డ ఉప్పును కాళ్లతో తొక్కకూడదు. శుభ్రంగా గుడ్డతో తుడిచి సింకులో వేయాలి.


ఉప్పు కొనేందుకు ఒక సమయం ఉంటుందని పరిహారశాస్త్రం చెబుతోంది. శుక్రవారం ఉదయం పూట మాత్రమే కొనాలంటోంది శాస్త్రం. శుక్రవారం ఏదైనా వస్తువు కొనే ముందు మొదటి వస్తువు ఉప్పు మాత్రమే కొనండి . తర్వాత ఏదైనా తీసుకోవచ్చు.మీ జీతంలో మొదటి రూపాయి శుక్రవారం నాడు ఉప్పు కొనడంతో ప్రారంభిస్తే ఐశ్వర్య లక్ష్మి దీవిస్తుందని శాస్త్రం చెబుతోంది. భర్త ఇచ్చే డబ్బుల్ని మహిళలు కొంతమంది వంటగదిలో ఏదో చోట దాస్తుంటారు. కొంతమంది పోపులపెట్టలో కానీ మరో చోట పెడుతుంటారు. అలా కాకుండా వంటగదిలో వాయువ్యం మూల దాస్తే మంచిది. అందులో గళ్ల ఉప్పు పోసి డబ్బులు దాచుకుంటే అవి రెట్టింపయ్యే అవకాశాలు నిండుగా కనిపిస్తాయి .వీలైతే ఉప్పును గాజుపాత్రలో పెట్టి అందులో డబ్బు దాచినా మంచిదే. ఇలా చేయడం వల్ల అక్కడ పెట్టిన డబ్బు ఏదోక విధంగా పెరుగుతూనే ఉంటుంది

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×