E-Paper
Advertisement

Maha shivarathri: శివరాత్రికి వీరు మాత్రం ఉపవాసం చేయకూడదు, ఎందుకో తెలుసా?

Maha shivarathri: శివరాత్రికి వీరు మాత్రం ఉపవాసం చేయకూడదు, ఎందుకో తెలుసా?
Advertisement

మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి ఆ శివుడిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ద్వారా శరీరం, మనస్సు పవిత్రం అవుతాయని నమ్ముతారు. కొందరు పూర్తిగా నీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉంటారు. మరికొందరు పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసం పాటిస్తారు. అయితే పండితులు చెప్పినట్లుగా ఉపవాసం తప్పనిసరి కాదు. భక్తి, ప్రార్థన, “ఓం నమఃశివాయ” జపం, రాత్రంతా జాగరణ ముఖ్యమని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి లేదా శారీరక సమస్యలు ఉన్నవారు కఠినంగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని కూడా సూచిస్తున్నారు.

పండితుల చెబుతున్న ప్రకారం కొంతమంది మహాశివరాత్రి ఉపవాసం ఉండకపోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి వారు పూర్తిగా ఉపవాసం ఉండకుండా, తేలికైన ఆహారం తీసుకుంటూ పూజ చేయడం మంచిదని సూచిస్తున్నారు. మందులు తీసుకునే వారు కూడా ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఉపవాసం వల్ల ఆరోగ్యం దెబ్బతింటే అది శుభం కాదని పండితులు చెబుతున్నారు. దేవుడికి భక్తి ముఖ్యం కాని శరీరానికి హాని కలిగించడం అవసరం లేదని కూడా వివరిస్తున్నారు.

Advertisement

ఉపవాస నియమాలు
మహాశివరాత్రి ఉపవాసం పాటించే వారు కొన్ని నియమాలు పాటించాలి. సాధారణంగా ఉపవాసం ముందు రోజు ఒకసారే భోజనం చేయడం మంచిదని చెబుతారు. పూజ చేసే రోజున ఉదయం స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి శివుడిని పూజించాలి. రోజంతా సాత్విక జీవన విధానాన్ని పాటించాలి. మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు తీసుకోకూడదు. ఎక్కువ శారీరక శ్రమ చేయకూడదు. రాత్రి జాగరణ చేసి శివుని నామస్మరణ చేయడం, అభిషేకం చేయడం, ధ్యానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఉపవాసం ముగించేటప్పుడు పంచాంగంలో చెప్పిన సమయాన్ని పాటించడం శుభంగా భావిస్తారు.

Also read: Coriander Pongali: కొత్తిమీర పొంగలి ఎప్పుడైనా తిన్నారా? రుచి అదిరిపోద్ది.. ఇదిగో రెసిపీ

Advertisement

ఎవరు ఉపవాసం చేయకూడదు?
మొత్తానికి మహాశివరాత్రి ఉపవాసం ఒక ఆధ్యాత్మిక ఆచారం. దీనిలో కఠిన నియమాలకన్నా మనస్ఫూర్తిగా చేసే భక్తి ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఎవరికైనా పూర్తిగా ఉపవాసం ఉండడం సాధ్యంకాకపోతే పండ్లు, పాలు తీసుకుంటూ కూడా పూజ చేయవచ్చు. ఆరోగ్యం బాగోలేని వారు లేదా బలహీనంగా ఉన్నవారు తమ శక్తి మేరకు పూజలు చేయడం సరిపోతుంది. శివుడిని స్మరించడం, మంచి ఆలోచనలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం కూడా ఉపవాసం చేసినంత పుణ్యంగా భావిస్తారు. గర్భిణులు, ముసలి వారు, డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు, తల తిరగడం, తీవ్ర అలసట, గుండె జబ్బులు వంటివాటితో బాధపడుతున్నవారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు.

Also read: Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×