చాలామందికి ఇంట్లో ఎన్నో వస్తువులను అలా దాచి ఉంచడం అలవాటు. అవసరం ఉన్నా, లేకున్నా కూడా అలానే ఉంచుతారు. ఇలాంటి పనులు చేయడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో నెగటివ్ శక్తి పెరిగిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించాలి. ప్రతికూల శక్తి పెరిగిందంటే ఆ ఇంట్లో కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు వస్తాయని అర్థం. ముఖ్యంగా మీరు ఐదు రకాల పాత వస్తువులను ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు రావచ్చు. అప్పుల పాలు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పిన వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసిపారేయండి.
పాత వార్తాపత్రికలు
ఎంతోమంది పాత వార్తాపత్రికలను ఇంట్లో ఉంచుతూ ఉంటారు. వాస్తు చెబుతున్న ప్రకారం ఇంట్లో పాత వార్తాపత్రికలు ఉంచడం శుభం కాదు. ఇవి ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఈ పాత వార్తాపత్రికల వల్ల వాస్తు దోషం కలుగుతుంది. కుటుంబంలో అనవసరమైన గొడవలు పెరుగుతాయి. కాబట్టి వీటిని ఇంటి నుండి వెంటనే తీసి పడేయండి.
పాత తాళాలు
వాడినా, వాడకపోయినా ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుందని తాళాలు దాచే వారి సంఖ్య కూడా ఎక్కువే. దెబ్బతిన్న తాళాలు, పాతవి, ఉపయోగం లేనివి, తుప్పు పట్టినవి ఉంటే ఇంట్లో నుంచి బయట విసిరేయడం మంచిది. ఈ తాళాలు అదృష్టాన్ని తగ్గించి మీ పురోగతిని అడ్డుకుంటాయి. కాబట్టి ఇలాంటి పాత తాళాలు ఇంట్లో ఉంచుకోకుండా ఉంటే అన్ని విధాలా మేలే జరుగుతుంది.
ఆగిపోయిన గడియారం
పనిచేస్తున్న గడియారం ఇంట్లో ఉంటే అది కాలాన్ని తెలియజేస్తుంది. కానీ ఆగిపోయిన గడియారాన్ని కూడా ఇంట్లో పెట్టుకునే వారు ఉన్నారు. అది అందంగా ఉందని అలా షో పీస్ లా ఉంటుందని గోడకే వదిలేస్తూ ఉంటారు. నిజానికి ఆగిపోయినా, పని చేయని గడియారం ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే ప్రతి పనికి అడ్డంకులు వస్తాయి. మీ ఇంట్లో విరిగిపోయిన గడియారాలు, పనిచేయని గడియారాలు ఉంటే వెంటనే బయటికి పడేయండి. లేకుంటే అవి మీ ఇంట్లోకి మంచి కాలాన్ని రానివ్వవు.
చెప్పులు, బూట్లు ఇంట్లో అధికంగా కొని పెట్టుకునే వారు ఎంతోమంది. అరిగిపోయిన చెప్పులు, వాడని చెప్పులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం ఇంట్లో చెడిపోయినా, విరిగిపోయిన చెప్పులు ఉంటే జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని పడేయాలనుకుంటే శనివారమే పారవేయండి. ఇలా శనివారమే అరిగిపోయిన చెప్పులు, పాడైన చెప్పులు పడేయడం వల్ల శని కోపం చాలా వరకు తగ్గుతుంది.
Also Read: వైఎస్ జగన్ మళ్లీ జైలుకు వెళ్తారా? కొత్త సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇంట్లో చిరిగిపోయిన పాత బట్టలను ఉంచుకోకండి. అలాంటివి వెంటనే ఎవరికైనా ఇచ్చేయండి. లేదా బయటపడేయండి. చిరిగిన పాత బట్టలు ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ లో, ఉద్యోగంలో పదేపదే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాత బట్టలను దాచుకోవడం మానేయండి.