Robinhood Movie : ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాబిన్ హుడ్ కూడా ఒకటి. హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కలిసి చేసిన ప్రమోషన్స్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వచ్చి ప్రచారం చేసినా… సినిమాపై ఆశించినంత బజ్ రాలేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీపై ఓ వార్త వినిపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం…
నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీ రాబిన్ హుడ్. గతంలో వీరి కాంబినేషన్ లో 5 ఏళ్ల క్రితం భీష్మ అనే మూవీ వచ్చింది. దీని తర్వాత మరే సినిమా చేయలేదు వెంకీ కుడుముల.
5 ఏళ్ల తర్వాత మళ్లీ నితిన్ తోనే ఈ రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. ముందుగా భీష్మ కాంబోతోనే ఈ రాబిన్ హుడ్ మూవీ చేయాలని అనుకున్నారు. నితిన్ – రష్మిక మందన్నా – వెంకీ కుడుముల కలిసి మూవీని కూడా అనౌన్స్ చేశారు. అయితే రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. శ్రీలీల యాడ్ అయింది.
ఇదింత పక్కన పెడితే… ఈ మూవీ స్టోరీని వెంకీ కుడుముల ఇప్పుడు రాసుకుంది కాదట. భీష్మ టైంలోనే ఈ కథను రాసుకున్నాడట. భీష్మ అయిపోయిన వెంటనే మళ్లీ నితిన్ తో చేయడానికి ఈ కథను రాసుకున్నాడట. అయితే, భీష్మ తర్వాత నితిన్ కు వేరే సినిమాలు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది.
5 ఏళ్ల నాటి కథ.. ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందా..?
ఈ రాబిన్ హుడ్ కథను వెంకీ కుడుముల 5 ఏళ్ల క్రితం రాసుకున్నాడు. అప్పుడు ఉన్న సందర్భాలకేు అనుకూలంగా ఆ స్టోరీని రాసుకున్నాడు. అది కరోనా టైం కాబట్టి… హీరోకు క్వారంటైన్ కు సంబంధించిన డైలాగ్స్ కూడా రాసుకున్నాడు.
ఇప్పుడు అదే కథ, అవే డైలాగ్స్ తో ఎలాంటి మార్పులు లేకుండా.. ఈ సినిమా చేశాడని సమాచారం. అప్పుడు పరిస్థితుల కథ… ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందా.?? అనేది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. కథ కాస్త అవుట్ డేటెడ్ అని టాక్ వచ్చిందంటే… సినిమా మొత్తం రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుంది.
కాగా, ఈ వారం రాబిన్ హుడ్ తో పాటు మ్యాడ్ స్క్వేర్ అనే మరో తెలుగు మూవీ రిలీజ్ అవుతుంది. అలాగే లూసిఫర్ 2 అనే మలయాళ మూవీ, వీర ధీర సూరన్ పార్ట్ 2 అనే తమిళ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ అన్ని సినిమాల్లో ఎక్కువ బజ్ ఉందంటే… రాబిన్ హుడ్ అనే చెప్పొచ్చు. దీని తర్వాత మ్యాడ్ స్క్వేర్ కి ఎక్కువ హైప్ ఉంది.
కానీ, ఓవరాల్ గా చూస్తే… లూసిఫర్ మూవీ పాన్ ఇండియా మూవీ. మలయాళంలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆ ఎఫెక్ట్ తెలుగులో మాత్రం లేదు.