మనుషుల జీవితాల్లో ఆధ్యాత్మిక భావనలు, నమ్మకాలు ఎక్కువ. ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల వస్తువులు చూడకూడదని, దేవుడిని చూడాలని, అరచేతిని చూసుకోవాలని ఇలా ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అలాగే ఉదయం లేచిన వెంటనే హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్ని రకాల వస్తువులను చూడకూడదని తెలుస్తోంది. వీటిని చూస్తే ఆరోజు అనుకున్న పనులు ఏవీ విజయవంతం కావని కూడా తెలుస్తోంది. అలాంటి వస్తువులు ఏమిటో తెలుసుకోండి. వీటిని చూడకుండా మీ ఉదయాన్నే ప్రారంభించండి.
ఆధ్యాత్మిక గురువులు, లైఫ్ కోచ్‌లు ఉదయాన్నే సానుకూలతతో ప్రారంభించాలని చెబుతారు. ఎప్పుడైతే రోజు సానుకూలమైన ఆలోచనలతో ప్రారంభం అవుతుందో ఆ రోజంతా మానసికంగా మెరుగ్గా ఉంటుందని అంటారు. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒత్తిడిని, వైఫల్యాన్ని, నష్టాన్ని ఎదుర్కోవాల్సి గుర్తు తెచ్చుకోకూడదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే శుభకరమైన వస్తువులనే చూడాలి. కొన్ని రకాల అశుభకరమైన వస్తువులను చూస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉండదని, మనశాంతి దక్కదని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంటుంది.
ఉదయం లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని చూడడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది మీ జీవితంలో చెడు సమయాలలో సూచిస్తుంది. మీ రోజంతా చెడిపోవడమే కాదు ఇంట్లో వాస్తు దోషాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆగిపోయిన గడియారాన్ని వెంటనే బాగు చేయించండి. లేదా ఆ గడియారాన్ని మీకంటే కనిపించకుండా ఎక్కడైనా ఒక మూలన పెట్టేయండి.
కొంతమంది ఉదయం మేల్కొన్న వెంటనే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. తమ ముఖారవిందం ఎలా ఉందో చూసి మురిసిపోతూ ఉంటారు. నిజానికి అద్దంలో నిద్ర లేచిన వెంటనే చేరడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే రాత్రంతా నిద్ర పోయిన తర్వాత వ్యక్తి ముఖం చాలా మారిపోతుంది. ముఖంలో ప్రతికూలత కనిపిస్తుంది. ముఖం కడుక్కుని స్వచ్ఛంగా శుభ్రం చేసుకున్నాకే అద్దం వైపు చూసుకోవాలి.
చాలామంది రాత్రిపూట గిన్నెలు తోమే ఓపిక లేక, వాటిని అలాగే వదిలేస్తారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత తోముతూ ఉంటారు. ఇలా వంటగదిలో తోమని గిన్నెలను వదిలి వేయడం లక్ష్మీదేవికి అసంతృప్తిని గురిచేస్తుందని అంటారు. అలాంటి ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని అంటారు. ఉదయం లేవగానే కడగని గిన్నెలను చూస్తే జీవితంలో మంచి జరగదని చెప్పుకుంటారు. కాబట్టి రాత్రిపూట వీలైనంతవరకు గిన్నెలు తోమడానికి ప్రయత్నించండి. పాచి గిన్నెలను ఇంట్లో ఎక్కువ సేపు ఉంచకండి అది ఏ మాత్రం మంచిది కాదు.
ఎంతోమందికి అడవిలో కనిపించే జంతువులు అంటే ఇష్టం. వాటి పెయింటింగ్‌లను ఇంట్లో పెట్టుకుంటారు. పులులు, సింహాలు, నక్కలు… ఇలా ఎన్నో రకాల వణ్య ప్రాణాలు ఫోటోలు ఇంట్లో ఉంటాయి. అయితే అది ఎలాంటి కళాఖండం అయినా కూడా ఉదయం లేచిన వెంటనే దాన్ని చూడకూడదని చెబుతోంది. వాస్తు శాస్త్రం వాటిని చూడటం వల్ల విశ్రాంతి లేకపోవడం వంటి అనేక సమస్యలు కలుగుతాయి. కాబట్టి మీ ఇంట్లో వన్యప్రాణులు లేదా అడవి జంతువుల ఫోటోలు ఉంటే వాటిని తీసి పారేయండి. లేదా మీ కంటికి కనిపించకుండా ఏ మూలనో దాచేయండి. అంతేకానీ ఇంట్లో పెట్టుకోవద్దు. అందులోనూ ఉదయం లేచిన వెంటనే చూడాలని బట్టి పనులు చేయవద్దు.
Also Read: శని సంచారం.. ఏప్రిల్ నుండి వీరు పట్టిందల్లా బంగారం
కొంతమంది ఉదయం లేచిన వెంటనే చేసే మొదటి పని చీపురును పట్టుకొని తుడవడం. అలా తుడిచేటప్పుడు మొదట చీపురునే చూస్తారు. నిజానికి ఉదయం లేచిన వెంటనే చీపురు, డస్ట్ బిన్ వైపు చూడకూడదు. కాసేపయ్యాక దేవుడిని స్మరించుకున్నాక, దేవుడి పటాలు చూశాక, మొక్కలు, పువ్వులు అన్నింటినీ చూశాక… అప్పుడే చీపురు పట్టుకొని తుడవడం మొదలుపెట్టాలి. ఉదయం లేవగానే చీపురు, డస్ట్ బిన్ కనిపించకుండా ఏదో ఒక మూలనా లేదా బాల్కనీలో పెట్టడం మంచిది.
(గమనిక ఇక్కడ ఇచ్చిన వార్త మేము మీకు కేవలం అవగాహన కల్పించేందుకే అందించాము. బిగ్ టీవీ దీనిని నిజమని ధ్రువీకరించడం లేదు. మీకు సందేహాలు ఉంటే ఆ రంగంలో నిపుణులను కలిసి సలహాలు తీసుకోవడం ఉత్తమం)