Parvati Nair:యువత ఆరాధ్య దేవత పార్వతీ నాయర్ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని, కుర్ర కారు హృదయాలను బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. తన నటనతో, పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ బ్యూటీ పార్వతీ నాయర్ తాజాగా నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాబోయే వరుడితో రొమాంటిక్గా ఫోటోలు దిగిన ఈ ముద్దుగుమ్మ.. లిప్ టు లిప్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఈ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది అభిమానులు మాత్రం.. మా గుండెలను ముక్కలు చేశావు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
పార్వతీ నాయర్ కాబోయే వరుడు..
ప్రస్తుతం తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రముఖ బ్యూటీ పార్వతీ నాయర్ ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ (Aashrith Ashok) తో ఏడడుగులు వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ..” న్యూ చాప్టర్ స్టార్ట్” అయినట్లు తెలిపింది. ప్రస్తుతం పార్వతి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది చూసిన అభిమానులు కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పార్వతీ నాయర్ కెరియర్..
పార్వతీ నాయర్ కెరియర్ విషయానికి వస్తే.. 15 సంవత్సరాలు ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కర్ణాటక మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన ఈమె, నెవీ క్వీన్ అందాల పోటీల్లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచింది. తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పార్వతీ నాయర్ మిస్ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని మొదటి బహుమతి కూడా అందుకుంది. తన అందంతో ఆకట్టుకున్న ఈమె నటన రంగంలో రాణించాలనుకుంది. అందులో భాగంగానే 2012లో నటనపై ఫోకస్ పెట్టిన పార్వతీ నాయర్ తొలిసారి పాపిన్స్ (Poppins) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అలా మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పార్వతీ నాయర్.. ఆ తర్వాత పలు సినిమాలు నటించింది. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith)హీరోగా నటించిన ‘ఎన్నై అరిందాల్’ అనే సినిమాలో విలన్ గా నటించిన అరుణ్ విజయ్(Arun Vijay) కి జంటగా నటించింది. ఇక్కడ తన అద్భుతమైన నటనతో మెప్పించిన పార్వతి ఉత్తమ సహాయనిటిగా ఫిలింఫేర్ అవార్డుకి కూడా నామినేట్ అయ్యింది. చివరిగా మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమాలో కూడా నటించిన ఈమె, ప్రస్తుతం ‘ఆలంబన’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూనే మరొకవైపు వైవాహిక జీవితాన్ని కూడా చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా పార్వతీ నాయర్ షేర్ చేసిన ఫోటోలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.