Shani: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారంశని తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. శనీశ్వరుని అనుగ్రహం వల్ల ఎవరైనా పేదవాడైనప్పటికీ రాజు కాగలడు, కానీ శనీశ్వరుడి దృష్టి అతనిపై పడితే మాత్రం ఎవరైనా రాత్రికి రాత్రే పేదవాడు అవుతాడు. శని స్థానంలో మార్పు కొన్ని రాశులపై సానుకూల ప్రభావాలను తెస్తే, మరికొందరిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మార్చిలో శని కుంభరాశి నుంచి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత, నక్షత్రరాశి మారి సూర్యుని రాశిలోకి వెళుతుంది.
ఏప్రిల్ 28, 2025 ఉదయం 7:52 గంటలకు శనిగ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం అన్ని రాశులపై మంచి తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. శని నక్షత్ర మార్పు ఏ రాశుల మీద శుభ ప్రభావాన్ని కలిగి ఉంటుందో.. ఏ 3 రాశుల వారు శని సంచారం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
ఉత్తర భాద్రపద నక్షత్రంలో శని సంచారం వల్ల వృషభ రాశి వారి అదృష్టం పెరుగుతుంది.ఏప్రిల్ 28 నుండి మీకు మంచి రోజుల ప్రారంభం అవుతాయి. మీరు ఏ పనులు చేయాలని నిర్ణయించుకున్నా, అవి విజయవంతమవుతాయి. జీవితంలో ప్రతికూల ప్రభావాల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. ఇది సంపద పెరుగుదలకు దారితీస్తుంది. మీ ఆఫీసుల్లో సీనియర్ అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చదువులో విజయాన్ని పొందుతారు. మీ కెరీర్‌లో పురోగతికి అవకాశాలను కూడా అందుతాయి. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు పెరిగే సమయం ఇది.
సింహ రాశి :
ఏప్రిల్ 28 నుండి సింహ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది .రాబోయే రోజులు మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులు చదువు సంబంధిత పనులలో విజయం సాధిస్తారు. మీరు జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.
Also Read: గురుడి సంచారం.. ఫిబ్రవరి 4 నుండి వీరికి డబ్బే డబ్బు
తులారాశి :
ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి శని సంచారం వల్ల తులా రాశి వారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా ఈ సమయంలో మీ అదృష్టం మెరుగుపడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో కూడా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను చూస్తారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు