Travis Head: ఐపీఎల్ 2025 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్లే ఆఫ్ రేసులో బలహీనంగా మారింది ఆరెంజ్ ఆర్మి. ఎస్ఆర్హెచ్ అంటే అదరగొట్టేస్తారని, బరిలోకి దిగితే రికార్డులు కురిపిస్తారని, ఈసారి 300 పరుగులు పక్కా అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఈ సీజన్ ప్రారంభం కాకముందు నుండే భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను ఉసూరుమనిపిస్తుంది హైదరాబాద్ జట్టు.
Also Read: Rohit Sharma Ritika: బ్యాటింగ్ చేతకాదు కానీ… భార్యతో రోహిత్ షికార్లు
300 పరుగులు కాదు కదా.. కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోతోంది. ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచ్లలో ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలుపొంది.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. మొన్నటి వరకు ఏదైతే తమ బలంగా భావించిందో.. అదే వారికి బలహీనంగా మారిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి రిటైన్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లు తేలిపోతున్నారు. నిజానికి గత సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆట ఓ రేంజ్ లో కనిపించింది.
మైదానంలోకి ఆరెంజ్ ఆర్మీ వచ్చిందంటే చాలు భారీ స్కోర్లు నమోదయ్యాయి. టైటిల్ తృటిలో చేజారినా.. ఓవరాల్ గా మంచి బ్యాటింగ్ లైనప్ తో {SRH} తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. దీంతో విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కోసం 14 కోట్లు ఖర్చు చేసి రిటైన్ చేసుకుంది. కానీ వీరు అభిమానుల అంచనాలను బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు 16.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి దిగజారింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇలా వరుస ఓటములతో సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
Also Read: Shreyas Iyer: పంజాబ్ దారుణ ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్ లో దారుణంగా ఏడ్చిన కెప్టెన్
గుజరాత్ టైటాన్స్ తో ఆదివారం మ్యాచ్ ఓడిన అనంతరం.. సోమవారం రోజు హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు హెడ్. ఈ క్రమంలో హెడ్ నీ చూసిన అభిమానులు అతనితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో హెడ్ కాస్త ఓవరాక్షన్ చేశాడని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నెటిజెన్లు. ఓ లేడీ ఫ్యాన్ హెడ్ వద్దకు వెళ్లి సెల్ఫీ అడగగా.. అందుకు హెడ్ నిరాకరించాడు. దీంతో అక్కడే ఉన్న అభిమానులంతా హెడ్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజెన్లు హెడ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">