Chaitra Navratri 2025: చైత్ర నవరాత్రి మొదటి రోజున.. మార్చి 30న సాయంత్రం 4:35 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 06:12 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఇది ఒక శుభ యోగం.సనాతన ధర్మంలో చైత్ర నవరాత్రి కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చైత్ర నవరాత్రి.. చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ప్రతిపాద తిథిలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం 2025 లో చైత్ర నవరాత్రి మార్చి 30.. ఆదివారం నుండి ప్రారంభం కానుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సంవత్సరం దుర్గామాత ఏనుగుపై స్వారీ చేస్తూ వస్తుందట కాబట్టి.. ఇది శుభ సంకేతం. లక్ష్మీ దేవి ఏనుగుపై స్వారీ చేసినప్పుడల్లా ఆమె చాలా ఆనందాన్ని , శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. చైత్ర నవరాత్రుల మొదటి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది.
చైత్ర నవరాత్రుల మొదటి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడటం ఈ రోజును మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. అలాగే ఈ రోజున ఇంద్ర యోగం ఏర్పడుతుంది . సర్వార్థ సిద్ధి యోగం మార్చి 30న సాయంత్రం 4:35 నుండి మరుసటి రోజు ఉదయం 06:12 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు దేవీ అనుగ్రహంతో విజయవంతం అవుతాయి. ఈ రోజున ఏర్పడే శుభ యోగం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
చైత్ర నవరాత్రి నుండి మిథున రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో వారి అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారు. అంతే కాకుండా దుర్గాదేవి ఆశీస్సులతో, వ్యాపారంలో ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉంటాయి. నవరాత్రి సమయంలో ఏ పని ప్రారంభించినా.. దాని విజయం ఖాయం. కొత్త పనులు ప్రారంభించే వారికి కూడా ఇది మంచి సమయం. పెట్టుబడుల్లో కూడా లాభాలు చాలా వరకు పెరుగుతాయి. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండటానికి అనుకూలమైన అవకాశాలు కూడా మీకు లభిస్తాయి.
Also Read: చాణక్య నీతి ప్రకారం.. ఈ విషయాలను భార్యకు అస్సలు చెప్పకూడదట !
తులా రాశి:
ఈ చైత్ర నవరాత్రి తులా రాశి వారికి ఆనందం, శ్రేయస్సును తీసుకురాబోతోంది. తులా రాశి వారికి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అంతే కాకుండా ఈ శుభ యోగాల ప్రభావం వల్ల.. మీరు వృత్తి , వ్యాపారం రెండింటిలోనూ విజయం సాధిస్తారు. చాలా కాలంగా పేలవంగా ఉన్న మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విజయ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి తొలగిపోతుంది.
వృషభ రాశి:
ఈ నవరాత్రి మకర రాశి వారికి ఆనందం , శ్రేయస్సును తీసుకురాబోతోంది. లక్ష్మీ దేవి ఆశీర్వాదాలతో.. ఈ ప్రజల ఆర్థిక కష్టాల కాలం ముగియబోతోంది. అంతే కాకుండా వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి బలమైన అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతే కాకుండా మీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.