Chanakyaniti: ఆచార్య చాణక్యుడు అత్యంత జ్ఞానవంతుడు, పండితుడు. తన జీవితకాలంలో.. అతను అనేక విధానాలను రూపొందించాడు. ఈ విధానాలే తరువాత చాణక్య నీతిగా ప్రసిద్ధి చెందాయి. ఎవరైనా విజయవంతమైన, సంపన్నమైన ,సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నట్లయితే.. వారు చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని చెబుతారు.
ఈ రోజు మనం చాణక్య నీతిలో ప్రస్తావించబడిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఒక తెలివైన వ్యక్తి తన భార్యకు ఎప్పుడూ చెప్పకూడని విషయాలను గురించి కూడా చాణక్య నీతిలో ప్రస్తావించబడింది. మరి ఎలాంటి విషయాలను మీ భార్యకు చెప్పనప్పుడు, మీరు మెరుగైన, గౌరవప్రదమైన , సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందో.. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విరాళ సమాచారం:
చాణక్య నీతి ప్రకారం.. మీరు మీ భార్యకు దానధర్మాలకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ చెప్పకూడదు. దానం గురించి సమాచారం ఇవ్వడం శాస్త్రాలలో నిషేధించబడింది. మీరు వేరొకరికి దానధర్మం గురించి చెప్పినప్పుడు.. దాని ప్రయోజనాలు మీకు లభించవు. కొన్నిసార్లు మీ భార్య దానం చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. బంధం బలహీనంగా మారేందుకు కూడా ఇది కారణం అవుతుంది. అందుకే ధాన దర్మాలకు సంబంధించిన విషయాలను చెప్పకూడదు.
ఆదాయ సమాచారం:
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీరు మీ ఆదాయం గురించి మీ భార్యకు కూడా సమాచారం ఇవ్వకూడదు. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో మీకు మాత్రమే తెలియాలి. చాలా సార్లు మీ భార్య మీ జీతం గురించి తెలుసుకున్నప్పుడు, ఆమె ఇంటి బడ్జెట్‌ను కూడా పాడు చేయవచ్చు. అంతే కాకుండా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు మీరు ఆదాయ సంబంధిత విషయాలను గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా మీ భార్యకు తెలియకుండా ఉండండి.
గత సమాచారం:
చాణక్య నీతి ప్రకారం.. మీరు మీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నా.. మీ గతం గురించి ఆమెకు అస్సలు చెప్పకూడదు. మీరు గతాన్ని మరచిపోయి మీ భవిష్యత్తు జీవితంపై దృష్టి పెట్టాలి. మీరు మీ భార్యకు గతానికి సంబంధించిన విషయాల గురించి చెప్పినప్పుడు.. గొడవ సమయంలో ఆమె కూడా మరో సారి మీరు చెప్పిన విషయాలను తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా గొడవ పెరిగే ప్రమాదాలు కూడా ఉంటాయి.
Also Read: శుక్రుడి సంచారం.. మార్చి 23 నుండి వీరు పట్టిందల్లా బంగారం !
మీ బలహీనతలు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీ బలహీనతలను మీ భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు. మీ భార్య మీ బలహీనతల గురించి తెలుసుకున్నప్పుడు.. ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆమె ఈ సమస్యలను మీ ముందు లేవనెత్తడం ద్వారా మిమ్మల్ని గెలవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. వీలైనంత వరకు ఇలాంటి విషయాలను అస్సలు చెప్పకూడదు. మీ బలహీనతలు తెలుసుకున్న వారు మిమ్మల్ని ఆ విషయాలతో ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మీ మనశ్శాంతిని పాడు చేసే ప్రమాదం ఉంటుంది.