Naga Chaitanya – Shobhita:అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. అటు సినీ కెరియర్ పరంగా తండేల్ (Thandel ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇటు వ్యక్తిగతంగా ప్రేమించిన అమ్మాయి శోభిత ధూళిపాల (Shobhita dhulipala) తో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న నాగచైతన్య తన భార్యతో కలిసి తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఆ ఇంటర్వ్యూలో తమ తొలిప్రేమ ఎలా మొదలైంది? ఎప్పుడు? ఎక్కడ? ఎలా కలుసుకున్నారు? ఇలా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అలా మా తొలిప్రేమ మొదలైంది..
మొదట శోభిత మాట్లాడుతూ.. నేను 2018 లోనే నాగార్జున (Nagarjuna)ఇంటికి వెళ్లాను. కానీ 2022 ఏప్రిల్ తర్వాతే చైతూ తో నా స్నేహం మొదలైంది. ఇక నేను నిత్యం ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటాను. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా నాగచైతన్యాతో తరచూ చాట్ చేసేదాన్ని. చాలాసార్లు చైతూ నన్ను తెలుగులో మాట్లాడమని అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడింది. మా ప్రేమకు ఇంస్టాగ్రామ్ వేదిక అయింది. మొదటిసారి ఇద్దరం కలవాలని చైతూ చెప్పినప్పుడు.. నేను కూడా ఓకే చెప్పాను. అలా ముంబైలోని ఒక కేఫ్ లో మేమిద్దరం కలిసాము. అయితే అప్పుడు నేను ముంబైలో ఉంటే.. చైతూ హైదరాబాదులో ఉండేవారు. కానీ నా కోసం ఆయన హైదరాబాద్ నుండి ముంబై వచ్చేవారు. అలా ముంబైలో ఒకసారి లంచ్ కోసం హోటల్లో కలవగా అప్పుడు చైతూ బ్లూ సూట్ ధరించగా.. నేను రెడ్ డ్రెస్ వేసుకున్నాను. ఇక అప్పటివరకు నేను, నాగచైతన్య నేరుగా కలిసింది లేదు. అలా మా ప్రేమ తొలి చూపులు అక్కడి నుండే మొదలయ్యాయి. ఇక న్యూ ఇయర్ వేడుకలకు నన్ను చైతూ కుటుంబం ఆహ్వానించగా.. ఆ మరుసటి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలకు నా కుటుంబం చైతూ ని ఆహ్వానించింది. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని గోవాలో పెళ్లి ప్రపోజల్ పెట్టుకున్నాము” అంటూ తమ తొలిప్రేమ, పెళ్లి రహస్యాన్ని రివీల్ చేసింది శోభిత.
Betting Apps Case : బొక్కలో వేస్తాం… ఆ.. సెలబ్రెటీలకు డీసీపీ సీరియస్ వార్నింగ్..!
వారి వల్లే నాగచైతన్యను ఫాలో అవడం మొదలుపెట్టా – శోభిత
ఇకపోతే సోషల్ మీడియాలో నేను నిత్యం యాక్టివ్ గా ఉంటాను. అటు చైతూ కూడా నన్ను ఫాలో అవడం మొదలుపెట్టాడు. కానీ నేను ఆయనను ఫాలో కాలేదు. ఒకసారి ఒక నెటిజన్ మీరు ఎందుకు చైతన్యను ఫాలో కావడం లేదు. ఆయన మాత్రం మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు కదా! అని అడిగాడు. ఆ తర్వాత నేను చైతు ప్రొఫైల్ కి వెళ్లి చూస్తే .. అక్కడ నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే చైతూ ఫాలో అవుతున్నాడు. ఇక దాంతో నేను కూడా చైతూని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న వల్లే నేను చైతూ ని ఫాలో అవ్వట్లేదని తెలుసుకొని, ఫాలో అవ్వడం మొదలు పెట్టాను అంటూ శోభిత తెలిపింది. మొత్తానికి అయితే నాగచైతన్యతో పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఇంటర్వ్యూలో రివీల్ చేసింది శోభిత.