Krishnam Raju anniversary:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా తనకంటూ ఒక గుర్తింపును అందుకున్నారు కృష్ణంరాజు (Krishnam raju ). ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. అనారోగ్య సమస్యలతో మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇక ఆయన లేని లోటును ఆయన తమ్ముడి కుమారుడైన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తీరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు కృష్ణంరాజు యానివర్సరీ. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే కృష్ణంరాజు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఆస్తులు ఎంత? ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆయన తదనంతరం ఆయన ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి
కృష్ణంరాజు ఆస్తులు.. వాటి వివరాలు..
1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు.. రెబల్ స్టార్ గానే తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు.నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఈయనకు ఇద్దరు భార్యలు. ముగ్గురు కుమార్తెలు. ఇకపోతే ముగ్గురూ కూతుర్లే కావడంతో తన తమ్ముడు కుమారుడైన ప్రభాస్ ను సొంత కొడుకుగా భావించేవారు. అలా ప్రభాస్ కెరియర్ ను తీర్చిదిద్దడంలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో రాజుల వంశంలో జన్మించిన ఈయన పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టారు. ఈయన స్థిరాస్తుల విషయానికి వస్తే.. మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. అక్కడికి సమీపంలో రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి అల్లాపూర్ లో 860 చదరపు గజాల స్థలం కూడా ఉందని సమాచారం. ఇక మొగల్తూరులోని గాంధీ విగ్రహం సెంటర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఆరు సెంట్లు స్థలము, మొగల్తూరులో 12 సెంట్ల స్థలంలో 1994 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇల్లు ఉంది. కృష్ణంరాజు సతీమణి పేరిట పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి,రామన్నపాలెంలో 2.10ఎకరాల పొలం ఉంది.కోటవురట్ల సమీపంలో 6.46 ఎకరాలు, 4.07 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట, విజయవాడ సమీపంలోని గన్నవరంలో 70 సెంట్లు భూమి ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ లో 491.5 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు ఒకటి ఉంది. చెన్నైలోని సైదాపేటలో 3830 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది. కృష్ణంరాజు ఇద్దరు కూతుర్ల పేరు మీద శంషాబాద్ సమీపంలో 200 గజాల చొప్పున స్థలం రాసించినట్లు సమాచారం. అలాగే కృష్ణంరాజుకి హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. గోపికృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
కృష్ణంరాజు కార్ కలెక్షన్స్..
కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, రూ.40 లక్షల విలువైన టయోటా ఫార్చునర్ కార్ తోపాటు రూ. 2కోట్ల విలువైన మరికొన్ని కార్లు ఉన్నట్లు సమాచారం. ఇక మొత్తం కృష్ణంరాజు దగ్గర ఉన్న ఆస్తి విలువ సుమారుగా రూ.1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు మరికొన్ని ప్రదేశాలలో విలువైన ఆస్తులు ఈయన సొంతమట. ఇకపోతే ఈ ఆస్తులన్నీ కూడా కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లకి చెందుతాయని సమాచారం.