Chandra Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తి అన్ని రకాల శుభకార్యాలలో విజయం సాధిస్తాడు. దాంతో పాటు జీవితంలో ఆనందం కూడా కలసివస్తుంది. చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి సమస్యలను కలుగుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు అన్ని రాశుల వారికి మిశ్రమంగా ఉంటుంది. అనేక రాశుల వారికి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. అదే సమయంలో కొన్ని రాశుల వ్యక్తులు శుభ కార్యాలలో విజయం పొందుతారు. దీంతో పాటు మరికొన్ని రాశుల వారు వారి కుటుంబాలతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.
కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 01 నాడు మనస్సుకు కారకుడైన చంద్రుడు రాశి మారనున్నాడు. చంద్రుడు ధనుస్సు రాశి నుండి బయటకు వెళ్లి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. చంద్రుడి రాశి మార్పు అనేక రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా 4 రాశుల వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
చంద్రుడు రాశి మారడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టాలు పెరుగుతాయి. మతపరమైన ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉంది. మీ కీర్తి పెరుగుతుంది. అంతే కాకుండా అత్తమామల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు బహుమతులను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీరు మీ గురువుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. వృషభ రాశి వారు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటారు. మొత్తంమీద వృషభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు శివుడి విశేష ఆశీస్సులు పొందుతారు. ఆయన అనుగ్రహం వల్ల అన్ని రకాల సుఖాలు లభిస్తాయి. అదే సమయంలో, కర్కాటక రాశిలో బృహస్పతి కూడా ఉంటాడు. కొత్త సంవత్సరం మొదటి రోజున మీరు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీరు మీ భాగస్వామి నుండి ప్రేమ, బహుమతులు అందుకుంటారు. భాగస్వామ్య పనులలో విజయం ఉంటుంది. కర్కాటక రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజున శివునికి అభిషేకం చేయాలి. అంతే కాకుండా మీ వ్యాపరంలో కూడా లాభాలు పొందుతారు. ఉన్నత అధికారుల నుండి మద్దతు పొందుతారు.
Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. న్యూ ఇయర్ రోజు ఇలా చేయండి
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు చంద్రుని రాశిలో మార్పు వలన ప్రయోజనం పొందుతారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి చంద్రుడి దయతో కొత్త సంవత్సరం మొదటి రోజున ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. పొరుగువారితో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అంతే కాకుండా పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు.ఆఫీసుల్లో కూడా మిమ్మల్ని ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.