Horoscope Aries 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. మేష రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం మేష రాశి జాతకులకు ఆదాయం -2, వ్యయం-14 ఉంది. అంటే రెండు రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ విషయంలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజ్యపూజ్యం-5, అవమానం – 7 గా ఉంది. అంటే ఐదు మంది మీకు గౌరవం ఇస్తే.. ఏడు మంది మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : మేష రాశి జాతకులకు జనవరి నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక శ్రమ ఉంటుంది. కానీ ధనానికి ఆదాయానికి లోటు ఉండదు. దండిగా ధన లాభం కలుగుతుంది. ఈ నెలలో స్థిరాస్తులైన భూములు, అపార్ట్ మెంటులు కొనే సూచనలు ఉన్నాయి.
ఫిబ్రవరి : మేష రాశి జాతకులకు ఫిబ్రవరి నెలలో హోదాకు తగ్గ జీవితం గడుపుతారు. వైద్య, కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో ఉన్న వారికి వృత్తి పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించే అవశాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న వృత్తిలో స్వల్ప లాభాలు ఉంటాయి.
మార్చి : మేష రాశి జాతకులు ఈ నెలలో పనులు పూర్తి చేయడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. స్తిరాస్తులపై కొత్తగా ఆదాయం పొందుతారు. వాహనములు, భూములు, అపార్టుమెంట్లు కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలోనూ.. శ్రద్ధతో పట్టుదలతో పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించుట వలన మేలు జరుగుతుంది.
ఏప్రిల్ : మేష రాశి జాతకులు ఈ నెలలో వ్యాపార భాగస్వాములను గుడ్డిగా నమ్మితే మోసపోయే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు ఇష్టం లేని ప్రాంతానికి లేదా ఆఫీసుకు ట్రాన్స్ ఫర్ అయ్యే సూచనలున్నాయి. ఇష్ట దేవతారాధన మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
మే : మేష రాశి జాతకులకు ఈ నెలలో స్థానచలనం బంధు విరోధములు, స్త్రీ సౌఖ్యము, వస్త్రలాభము, గృహసౌఖ్యం కలుగును. భయాందోళన కలుగును. దూర ప్రయాణములు కలసి వచ్చును. తొందరపడి మాట్లాడుట మీ మాట తీరు వలన స్నేహితులు దూరం కాగలరు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం మీకే మంచిది.
జూన్ : మేష రాశి జాతకులు ఈ నెలలో తమ మాటలను అదుపులో ఉంచుకొనుటచే ఇబ్బందులు తొలగును. ధనలాభం, వస్తు లాభం కలుగును. ఇబ్బందులు తొలగును. సుఖము, సంతోషము కలుగును.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : మేష రాశి జాతకులకు ఈ నెలలో తమ సంతానానికి విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి అవకాశాలు కలసి వస్తాయి. అధికార హోదా పెరిగే అవకాశం ఉంది. అఖండ కీర్తి యోగం ఉన్నది. శత్రువులు స్థంభించి పోయేదరు. అన్ని విషయాలలో విజయం చేకూరును.
ఆగష్టు : మేష రాశి జాతకులకు ఈ నెలలో గృహ లాభం, వస్తు ప్రాప్తి, ఆదాయం బాగ పెరుగును. అలంకార సామాగ్రి కొనుగోలు చేస్తారు. కానీ ప్రయాణంలో స్వల్ప ఇబ్బందులు కలుగును. సంతానం విద్యలో ముందంజ వేస్తారు.
సెప్టెంబర్ : మేష రాశి జాతకులకు ఈ నెలలో మీ మనస్సుకు అనుకూల వాతావరణము ఏర్పడుతుంది. వస్త్ర లాభము ఉంది. ధన, ధాన్య లాభం ఉంది. కొత్తగా భూమిని కొంటారు. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
అక్టోబర్: మేష రాశి జాతకులకు ఈ నెలలో ఉపాధి రంగములలో కలసి వస్తుంది.
చిరు వ్యాపారులకు అభివృద్ధి కలుగును. భూలాభం, వాహన సౌఖ్యం, ప్రతి పనిలోను జయం కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుట మంచిది.
నవంబర్ : మేష రాశి జాతకులకు ఈ నెలలో వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణములలో ఆందోళనలు ఎదుర్కొనెదరు. మీపై ప్రజలలో మిత్రులలో చులకన భావం ఏర్పడును.
డిసెంబర్ : మేష రాశి జాతకులు ఈ నెలలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఇతరుల విషయంలో తగు జాగ్రత్త అవసరం. మితంగా మాట్లాడుట మంచిది. ఆభరణములు కొనుగోలు చేయుట, కార్యసిది ఏర్పడును. కానీ ప్రతి విషయంలోను కోపం కలుగును. కోపము తగ్గించుకొనుట మంచిది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?