ఈ ఘటనలో ఓ మహిళ తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. డ్రైవర్ లేకపోవడంతో వాహనాన్ని ఓనర్ నడిపినట్లు తెలుస్తోంది. అయితే.. డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమైన వెంకటరమణ.. ఈ ఘటనలో మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఇదిలా ఉంటే.. విజయవాడలో అర్థరాత్రి లారి బీభత్సం సృష్టించింది. రామవరపాడు రింగు వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్న వాహనాలపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 ఆటోలు, ఒక స్కూటీతో పాటు పోలీసు అవుట్ పోస్ట్ ధ్వంసమైంది. స్కూటిపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: అటు సంక్షేమం, ఇటు రాష్ట్రాభివృద్ధి.. ప్రజల సహకారంతో చేస్తామన్న సీఎం.. ప్రజలకు శుభాకాంక్షలు
లారీని అక్కడే వదిలి డ్రైవర్ పరార్ అయ్యాడు. ఆటోలను, లారీనీ పోలీసులు మాచవరం పీఎస్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన చెందిన వ్యక్తి ఏలూరు జిల్లా గుడివాక లంకకు చెందిన శివ రామకృష్ణగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుడు ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నట్లు తేల్చారు.
మరో వైపు.. బాపట్ల జిల్లా, మార్టూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుండి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరొక మహిళ ఉమ పరిస్థితి విషమంగా ఉంది. . మృతి చెందిన వారు విజయవాడ బాంబే కాలనీకి చెందిన పల్లపు గోపి, కొల్లు రాముగా పోలీసులు గుర్తించారు. బల్లికురవ మండలం, ధర్మవరం చర్చిలో ప్రార్ధనకు వెళుతున్న సమయంలో.. రాజుపాలెం రెస్ట్ ఏరియా వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.