Chandra Shukra Yuti 2025: హోలీకి సరిగ్గా 2 రోజుల తర్వాత అంటే సోమవారం, మార్చి 17, 2025 నాడు, చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి.. తులా రాశి ప్రవేశం వల్ల శుక్రుడు, చంద్రుడి మధ్య సంయోగం ఏర్పడుతుంది. తులా రాశికి అధిపతి శుక్రుడి అని చెబుతారు. శుక్రుడు , చంద్రుడి సంయోగ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ఇది అన్ని రాశుల వారిపై శుభ , అశుభ ప్రభావాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈ సంయోగం 3 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
మిథున రాశి వారిపై చంద్రుడు, శుక్రుల సంయోగం అధికంగా ఉంటుంది. ఈ సంయోగం వల్ల మార్చి 17 నుండి మిథున రాశి వారు శుభ వార్తలు అందుకుంటారు. అంతే కాకుండా మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితానికి చంద్రుడు, శుక్రుడి సంయోగం మేలు చేస్తుంది. ఉద్యోగం , వ్యాపారంలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభం ద్వారా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సహకారం వల్ల మీరు వ్యాపారంలో లాభం పొందుతారు. అంతే కాకుండా ఉన్నత అధికారుల నుండి మీరు ప్రయోజనాలను అందుకుంటారు. చాలా కాలంగా పెండిగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి చంద్రుడు, శుక్రుడి సంయోగం అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా ఇది మార్చి 17 నుండి మీ జీవితంలో అనేక శుభ పరిణామాలకు కూడా కారణం అవుతుంది. అ కర్కాటక రాశి వారికి చంద్రుడి, శుక్రుడి సంయోగం వల్ల విద్యా, ఉద్యోగం పట్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. అంతే కాకుండా మీరు పెట్టిన పెట్టుబడుల్లో కూడా చాలా లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు వ్యాపారంలో ఆర్థిక లాభం, ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగుల సహాయంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, పదోన్నతికి బలమైన అవకాశం ఉంటుంది.
Also Read: శని సంచారం.. ఈ 3 రాశుల వారికి డబ్బే.. డబ్బు !
తులా రాశి:
చంద్రుడి, శుక్రుడి సంచారం మీకు ఆనందాన్ని తెస్తుంది. మీరు ఆర్థిక బలాన్ని పొందుతారు. అలాగే, మీరు పని విషయంలో కొత్త ప్రాజెక్టులను పొందుతారు. అంతే కాకుండా మీ మానసిక స్థితి బాగుంటుంది. భూమికి సంబంధించిన పనులలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే పనులకు కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. అంతే కాకుండా ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆఫీసుల్లో మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులతో కూడా సంతోషకరమైన సమయం గడుపుతారు.