Business Idea: వేసవి కాలం వచ్చిందంటే చాలు… చల్లని ఐస్ క్రీమ్ తినాలని అందరికీ అనిపిస్తుంది. పిల్లలు, యువత, పెద్దవారు ఇలా అందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అయితే, మీరు ఈ ఐస్ క్రీమ్‌ను అమ్ముతూ పెట్టుబడి లేకుండా నెలకు రూ. 50,000 పైగా ఆదాయం సంపాదించవచ్చని మీకు తెలుసా? అంతేకాదు, ఈ బిజినెస్‌ను మీరు పార్ట్ టైం సమయంలో ఒకే చోట కూర్చొని, ఎక్కడికీ వెళ్లకుండానే నిర్వహించవచ్చు.
జీరో పెట్టుబడి
ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. కొంత శ్రమ, మంచి ప్లానింగ్, క్రియేటివిటీ ఉంటే చాలు. ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా అభివృద్ధి చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ బిజినెస్ ఎక్కడ ప్రారంభించాలి?
ఈ ఐస్ క్రీమ్ బిజినెస్‌కు మంచి లొకేషన్ ఎంచుకోవడం చాలా కీలకం. ప్రధానంగా ఎక్కువ మంది పిల్లలు, ఫ్యామిలీలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటే బిజినెస్ సక్సెస్ అవుతుంది.
పార్కులు – పిల్లలు, కుటుంబ సభ్యులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఐస్ క్రీమ్ వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది
బస్టాండ్లు – ప్రయాణికులకు ఐస్ క్రీమ్ తక్కువ ఖర్చుతో అందించవచ్చు
కాలేజ్‌లు – స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మంచి ఆదాయం సంపాదించవచ్చు
మార్కెట్లు – ఎక్కువ మంది వచ్చే ప్రాంతాల్లో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది
ప్లే గ్రౌండ్స్ – ఆటగాళ్లు, పిల్లలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు కూడా బెస్ట్ ఛాయిస్
Read Also: Business Idea: పెట్టుబడి సున్నా.. నెలకు రూ. 60 వేలకుపైగా …
బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఏం కావాలి
ఐస్ క్రీమ్ బిజినెస్‌ను ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం ఉండదు. మీరు ఐస్ క్రీమ్ తయారుచేసే వారి దగ్గరి నుంచి హోల్ సేల్ విధానంలో ఐస్ క్రీమ్స్ తీసుకుని సేల్ చేయాల్సి ఉంటుంది. కొన్నికంపెనీలు ఐస్ క్రీమ్స్ తోపాటు సేల్ చేసుకునేందుకు కూలర్ బాక్స్ వంటివి కుడా అందజేస్తాయి. దీంతో మీరు చేయాల్సింది కేవలం అమ్మడమే. తయారైన ఐస్ క్రీమ్‌ను కొనుగోలు చేసి అమ్మడం వల్ల, మీరు తయారీ శ్రమను ఆదా చేసుకోవచ్చు.
ఐస్ క్రీమ్ రకాలు
ఐస్ క్రీమ్ అమ్మే సమయంలో రుచికరమైన రకాల ఐస్ క్రీమ్‌లను అందించడం ద్వారా మీరు అనేక మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు.
పలు రకాల ఐస్ క్రీమ్‌లు
పార్ట్ టైం సమయం
వీటిని కనీసం రూ. 25 నుంచి రూ. 100 వరకు తీసుకుని సేల్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో ఏదైనా పార్క్ లేదా జనాలు ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్ పరిధిలో కూర్చుని అమ్ముకోవచ్చు. దీనిని పార్ట్ టైం సమయంలో కూడా చేసుకోవచ్చు. సాయంత్రం లేదా ఉదయం మీకు వీలైన టైంలో ఈ బిజినెస్ నిర్వహించుకోవచ్చు. అనేక మంది కాలేజీ యువతపాటు పలువురు నైట్ టైంలో కూడా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వీటిని సేల్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
ఆదాయం ఎంత
ఈ వ్యాపారంలో మీరు రోజుకు కనీసం 180 ఐస్ క్రీమ్స్ సేల్ చేసినా కూడా, ఒక్కో దానిపై కనీసం రూ. 10 లాభం వేసుకున్నా కూడా మీకు రోజు రూ. 1,800 ఆదాయం లభిస్తుంది. ఈ ప్రకారం చూస్తే మీరు నెలకు రూ. 54,000 సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక వేళ మీరు ప్రతి రోజు కూడా 200కుపైగా ఐస్ క్రీమ్స్ సేల్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.