Soundarya : దశాబ్ద కాలం పాటు సౌత్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సౌందర్య (Soundarya). అప్పట్లోనే భాషా బేధం లేకుండా వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంది. అందం, నటనలో నేటితరం సావిత్రి అనిపించేలా అప్పట్లో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కానీ ఆమె చనిపోయిన తర్వాత సౌందర్య అప్పటిదాకా కూడబెట్టిన వందల కోట్ల ఆస్తులపై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సౌందర్య తల్లి, ఆమె వదిన ఇద్దరూ ఆస్తి కోసం కోర్టు మెట్లు ఎక్కారు. మరి ఇంతకీ సౌందర్య ఉన్న ఆస్తులు ఎంత? ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే…
సౌందర్య 100 కోట్ల ఆస్తులు ఇవే
సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తవుతోంది. అయితే జలపల్లి లో ఉన్న ఫామ్ హౌజ్ కోసమే మోహన్ బాబు (Mohan Babu) సౌందర్యను హత్య చేయించాడని ఓ వ్యక్తి ఆరోపణలు చేయడంతో మరోసారి సౌందర్య ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు నెటిజెన్లు. 2004 ఏప్రిల్ 17న బిజేపీ తరపున ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ మరణించారు. అయితే అప్పటికే పెళ్లయిన సౌందర్య కడుపుతో ఉండడం, అలాంటి టైంలో చనిపోవడం ఆమె అభిమానులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.
ఇక సౌందర్య అప్పట్లోనే 100 కోట్ల ఆస్తిని సంపాదించింది. ఇప్పటికీ ఆమె ఆస్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయం ద్వారా కొన్ని ట్రస్టులకు విరాళాలు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం సౌందర్యకి బెంగళూరుతో పాటు హైదరాబాదులోనూ భారీగా ఆస్తులున్నాయి. అందులో స్థలాలు, కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ బిల్డింగులతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, నగలు కూడా ఉన్నట్టు సమాచారం.
బెంగళూరులోని హనుమంత్ నగర్ లో 42×36 అడుగుల ఫ్లాట్ లో రెండు ఇల్లు, మూడు దుకాణాలతో కూడిన ఓ భవనం ఉంది. ఆర్ అండ్ బి 2 స్టేజ్ లోని 28 x 15 మీటర్ల స్థలంలో ఓ ఆస్తి, అలాగే హెచ్ఆర్బిఆర్ ఎక్స్టెన్షన్లో 20 x 24 మీటర్ల ఖాళీ స్థలం, భవాని హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీలో 30×40 అడుగుల ఖాళీ స్థలం సౌందర్య పేరు మీద ఉండేవి.
అంతేకాకుండా సౌందర్య కి హైదరాబాద్ లోని శంషాబాద్ దగ్గర 6 ఎకరాల ఫామ్ హౌస్ ఉండేది. అదే ఆ తర్వాత సౌందర్య కుటుంబం మంచు మోహన్ బాబుకు అమ్మేయగా, ఇప్పుడు మోహన్ బాబు మంచు టౌన్షిప్ పేరుతో అక్కడ ఫామ్హౌస్ ని నిర్మించుకున్నారు.
ఆస్తుల పంపకం ఇలా…
ఇక సౌందర్య చనిపోక ముందే అంటే 23 ఏప్రిల్ 15న సౌందర్య వీలునామ రాసారని, దాని ప్రకారం ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మల, ఆమె కొడుకు సాత్విక్ 2009లో బెంగుళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కానీ సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని సౌందర్య తల్లి మంజుల, భర్త రఘు కోర్టుకు ఎక్కడంతో అప్పట్లో ఆస్తులపై గట్టిగానే రచ్చ నడిచింది. అయితే 2013 డిసెంబర్ 3 తేదీన ఆస్తులపై రాజీకి రావాలని కోర్టు సూచించడంతో, పెట్టిన కేసులన్నిటిని వాపస్ తీసుకుని, ఈ ఆస్తులను పంచుకున్నారు.
సౌందర్య మేనల్లుడు సాత్విక్ కు హనుమంత నగర్లో ఉన్న ప్రాపర్టీ, 25 లక్షల ఫిక్స్ డిపాజిట్ దక్కింది. అలాగే నిర్మలకు 1.25 కోట్ల ఆస్తులను ఇచ్చారు. అనంతరం అమర్నాథ్ పేరు మీద ఉన్న ఆరు ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ పై వచ్చే ఆదాయాన్ని మంజుల, నిర్మల, సాత్విక్, రఘు పంచుకున్నారు. అలాగే హైదరాబాద్లోని శంషాబాద్ ప్రాంతంలో ఉన్న 6 ఎకరాల భూమి సౌందర్య తల్లిదండ్రుల పేర్లపై రిజిస్టర్ అయి ఉంది. దాన్ని మోహన్ బాబుకు అమ్మేసి మంజుల, రఘు సమానంగా పంచుకున్నారని టాక్.