1. ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉంచడం:మీ ఇంటి ప్రధాన ప్రవేశద్వారం (మెయిన్ ఎంట్రన్స్) అనేది ఇంట్లోకి సానుకూల శక్తి, అదృష్టం, డబ్బు ప్రవేశించే మార్గం. ఇది ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆకర్షణీయంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి.
ఏం చేయాలి:మెయిన్ డోర్ యొక్క తలుపును శుభ్రంగా తుడిచి, రంగులు వేసినా లేదా అందంగా అలంకరించినా మంచిది. తలుపు దగ్గర మంచి వెలుతురు ఉండేలా చూసుకోండి. పేరు పలక (Nameplate) ఏర్పాటు చేయడం, ఓం లేదా స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను ఉంచడం ద్వారా సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. బూట్లు, చెత్త లేదా ఇతర వస్తువులను మెయిన్ డోర్ దగ్గర ఉండకుండా చూసుకోండి.
2. వాయువ్య దిశను (నార్త్ డైరెక్షన్) శుభ్రంగా ఉంచడం: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశ కుబేరుడు (ధన దేవత) పాలించే దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశను శుభ్రంగా ఉంచడం ద్వారా ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
ఏం చేయాలి: మీ ఇంటి ఉత్తర భాగాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, చిందరవందరగా లేకుండా ఉంచండి. ఈ ప్రదేశంలో బరువైన వస్తువులను లేదా షూ ర్యాక్‌లను ఉంచకుండా ఉండండి. ఇక్కడ ఒక అద్దం లేదా మనీ ప్లాంట్ ఉంచడం ద్వారా సంపదను రెట్టింపు చేయవచ్చు.
3. వృధాను అరికట్టడం (నీటి లీకేజీలు): డబ్బును ఆకర్షించడంలో నీరు ఒక ముఖ్యమైన అంశం. నీటి లీకేజీలు లేదా వృధా ఆర్థిక నష్టాలను సూచిస్తుంది.ఏం చేయాలి: ఇంట్లో ఎక్కడైనా లీకవుతున్న పంపులు, పైపులు లేదా ట్యాంకులు ఉంటే వెంటనే బాగు చేయించండి. బాత్రూమ్ లేదా కిచెన్‌లో నీరు నిలిచిపోకుండా చూసుకోండి. నిరంతరం నీరు కారుతూ ఉండటం ఆర్థికంగా నష్టాన్ని సూచిస్తుంది.
4. సంపద చిహ్నాలను ఉంచడం:కొన్ని వస్తువులు లేదా మొక్కలు సంపద, శ్రేయస్సుకు చిహ్నాలుగా పరిగణించబడతాయి. వీటిని ఇంట్లో ఉంచడం ద్వారా సానుకూల శక్తిని, డబ్బును ఆకర్షించవచ్చని నమ్ముతారు.ఏం చేయాలి:
మనీ ప్లాంట్: మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో లేదా ఉత్తర దిశలో ఉంచడం మంచిది. ఇది ఆర్థిక విజయాన్ని, సమృద్ధిని ఆకర్షిస్తుందని నమ్ముతారు.
నీటి ఫౌంటెన్/అక్వేరియం: ఇంటి ఈశాన్య దిశలో చిన్న నీటి ఫౌంటెన్ లేదా అక్వేరియం ఉంచడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుంది.