BigTV English

Kamran Akmal: 18 ఏళ్లు అయిన పాకిస్తాన్ దరిద్రం పోలేదు.. అదే చెత్త కీపింగ్… ఇంకా ఎన్నేళ్లు చంపేస్తార్రా

Kamran Akmal:  18 ఏళ్లు అయిన పాకిస్తాన్ దరిద్రం పోలేదు.. అదే చెత్త కీపింగ్… ఇంకా ఎన్నేళ్లు చంపేస్తార్రా
Kamran Akmal:  సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. కొంత మంది బ్యాట్స్ మెన్స్ తపపులు చేసి ఔట్ అవుతుంటారు. కొంత మంది ఫీల్డర్లు క్యాచ్ లు వదిలేస్తారు. కొంత మంది బౌలర్లు కూడా పొరపాట్లు చేసి లూస్ బంతులు వేసి పరుగులు సమర్పించుకుంటారు. వాళ్లు బాగా ఆడాలని అనుకున్నప్పటికీ ఆడలేకపోతుంటారు. ఇది ప్రతీ క్రికెటర్ జీవితంలో జరిగే సంఘటనే. తాజాగా ఓ పాకిస్తాన్ క్రికెటర్ కి ఇలాంటి ఘటనే జరిగింది. అతని జీవితంలో గతంలో పొరపాటు జరిగింది. సరిగ్గా 17 ఏళ్ల కింద కూడా ఇలాంటి పొరపాటు జరిగింది. తాజాగా జరిగింది.

Also Read :  Hardik – Jasmin : కొత్త ప్రియురాలుతో హార్దిక్ పాండ్యా బ్రేకప్… నటాషా వార్నింగ్ ఇచ్చిందా !


కమ్రాన్ అక్మల్ చెత్త కీపింగ్.. 

అతను చేసింది మరెవ్వరో కాదు.. పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్. ఈ పేరు గుర్తే ఉంటుంది కదా.. పాకిస్తాన్ కి చెందిన మాజీ వికెట్ కీపర్. స్టంప్స్ వెనుక ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. అదొక్కటే అతని స్పెషాలిటీ.. అయితే ఇతని గురించి ఎందుకు అంత చర్చ అనుకుంటున్నారా..? ఎందుకంటే.. వికెట్ల వెనుక తన అద్భుత ప్రతిభ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అతను ట్రోలింగ్స్ కి గురయ్యాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికి ఎనిమిదేల్లు అవుతుంది. అక్మల్ వికెట్ కీపింగ్ మాత్రం ఇప్పటికీ అభిమానులకు గుర్తుండటం గమనార్హం.  ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరిట మాజీ క్రికెటర్లందరూ కలిసి ఓ టోర్నీ లో ఆడుతున్న విషయం తెలిసిందే. నిన్న ఇంగ్లాండ్ ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.


పాక్ విజయం.. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ పై పాకిస్తాన్ ఛాంపియన్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యం ఛేదనలో ఇంగ్లాండ్ 155 పరుగులకే పరిమితమైంది. ఓపెన్ ఫిల్ మస్టర్డ్ (58), ఇయాన్ బెల్ (51) హాఫ్ సెంచరీలు చేసినా ఓటమి తప్పలేదు. హాఫ్ సెంచరీ చేసిన మస్టర్డ్ ను ఔట్ చేసే అవకాశాన్ని కమ్రాన్ అక్మల్ విడిచిపెట్టాడు. షోయబ్ మాలిక్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన మస్టర్డ్ క్రీజ్ ను దాటి ముందుకొచ్చాడు. బంతిని ఒడిసిపట్టి స్టంపౌట్ చేయడంలో అక్మల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో పాక్ గెలిచినప్పటికీ అక్మల్ కీపింగ్ వైఫల్యం పై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. బ్యాటింగ్ లోనూ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు అక్మల్. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం గమనార్హం. థ్యాంక్స్ కమ్రాన్ భాయ్.. మళ్లీ 2008 జ్ఞాపకాలను గుర్తు చేశావ్. తాను ఇప్పుడు 14 ఏళ్ల కుర్రాడి గా మారిపోయాను. ఎందుకంటే అప్పుడూ నేను చూసినవి మళ్లీ ఇప్పుడు చూస్తున్నా అని కొందరూ.. మరణం, పన్నులు, అక్మల్ క్యాచ్ డ్రాప్ చేయడం ఈ మూడు జీవితంలో గ్యారెంటీ అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ డ్రాప్ ఈజ్ పర్మినెంట్.. ఇది కమ్రాన్ అక్మల్ స్టైల్ అని.. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అందులో కమ్రాన్ వాటిని అస్సలు వదలడు అంటూ కామెంట్స్ చేయడం విశేషం. 

?igsh=MTdkenY1M2ZkYXBhbw==

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×