Graha Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మార్చి 29, 2025 శనివారం గ్రహాల సంచారానికి సంబంధించి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున.. ఆరు గ్రహాలు ఒకే రాశిలోకి వస్తాయి. ఈ గ్రహాలన్నీ ఎప్పటికప్పుడు ఒకదానితో ఒకటి కలిసి వివిధ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. రెండున్నర సంవత్సరాల తర్వాత శనిదేవుడు కూడా కుంభ రాశి నుండి మీన రాశిలోకి వెళ్లనున్నాడు.
శుక్రుడు ఇప్పటికే మీన రాశిలో ఉన్నాడు. సూర్యుడు, బుధ గ్రహాలు కూడా ఇప్పటికే మీన రాశిలో ఉన్నాయి. మార్చి 29 న చంద్రుడు కూడా మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ విధంగా.. మీన రాశిలో 6 గ్రహాల రాక ఒక అరుదైన యాదృచ్చికతను సృష్టించబోతోంది. దీని వల్ల కొన్ని రాశులకు ప్రయోజనం కలుగుతుంది.
సింహ రాశి:
మీన రాశిలో 6 గ్రహాల సంచారం సింహ రాశి వారికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఫలితంగా సింహ రాశి వారిపై సానుకూల ప్రభావం ఉంటుంది. మార్చి 29 నుండి సింహ రాశి వారు అపారమైన ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది. అలాగే.. మీకు అదృష్టం ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. ఈ అరుదైన యోగం సింహ రాశి వారి జాతకంలో ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతుంది. మీ ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అంతే కాకుండా వ్యాపారం, ఉద్యోగంలో ఒకదాని తర్వాత ఒకటి పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం అవుతుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు కూడా అందుకుంటారు.
ధనస్సు రాశి :
మార్చి 29న ఏర్పడే షష్ట గ్రాహ కూటమి ధనస్సు రాశి వారికి దేవుడిచ్చిన వరం లాంటిది. ఈ యోగం యొక్క శుభ ప్రభావం వల్ల.. ధనస్సు రాశి వారికి వాహన యోగం కలుగుతుంది. ఇదే కాకుండా.. ఇతర వస్తు సౌకర్యాలలో పెరుగుదల ఉంటుంది. ఈ యోగం ధనస్సు రాశి వారి జాతకంలో నాల్గవ ఇంట్లో ఏర్పడబోతోంది. దీని కారణంగా వ్యాపారంలో కూడా ఊహించని పురోగతి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి అధిక లాభాలు కూడా పొందుతారు. అంతే కాకుండా మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్లొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు.
Also Read: సమ్మర్‌లో ఫేస్‌కి ఈ ఒక్కటి వాడితే.. రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తారు !
మకర రాశి:
మకర రాశి వారి జీవితాల్లో షష్ట గ్రహ కూటమి ప్రత్యేక శుభ సమయాన్ని తీసుకురాబోతోంది. ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. దీని కారణంగా వారి విజయ అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. అంతే కాకుండా కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. వాహనాలు, ఆస్తిలో పెట్టుబడులు సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మీ ఆర్థిక పెరుగుదలకు ఇది చాలా మంచి సమయం. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి.