Robinhood Movie : నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ రాబిన్ హుడ్ అని చెబుతూ వస్తున్నారు. అందులోనూ… ఈ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తున్నాడు. అలాగే… ప్రమోషన్స్ కూడా ఎక్కువే చేస్తున్నారు. డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరో నితిన్ ప్రతి రోజు ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే… ఈ మూవీ రిలీజ్ ఈవెంట్‌ను నిన్న (మార్చి 23)న గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా ఈ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు
అయితే వార్నర్ వచ్చి… ఇంటర్వ్యూలు ఇచ్చినా… ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో స్పీచ్ ఇచ్చినా… వార్నర్‌ను రాజేంద్ర ప్రసాద్ దొంగ నా కొ*** అని తిట్టినా… రాబిన్ హుడ్ సినిమాకు బజ్ అయితే ఆశించిన స్థాయిలో రావడం లేదు.
నితిన్ – వెంకీ కుడుముల చేసిన ప్రమోషన్స్, వార్నర్ గెస్ట్‌గా రావడం… వల్ల సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వాల్సింది. కానీ, అలాంటి బజ్ కనిపించడం లేదు. నితిన్ చెప్పినట్టు… ఆయన కెరీర్‌లోనే పెద్ద సినిమా అని చెబుతున్నట్టు… అలాంటి ఫీల్ అనేది బయట లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.
దీనికి కారణం… అంటే, హీరో, డైరెక్టర్ తో పాటు వార్నర్ రావడంతో ప్రమోషన్స్ పరంగా బానే చేశారు. కానీ, సినిమా నుంచి కంటెంట్ పెద్దగా రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు రివీల్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ను చూస్తే… అందులో “అది దా సర్ప్రైజ్…” అనే సాంగ్ మాత్రమే కొంతలో కొంత వైరల్ అయింది. దానిపై కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. హుక్ స్టెప్ పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. మహిళా కమీషన్ కూడా స్పందించాల్సి వచ్చింది.
ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో సినిమాపై సినీ లవర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నిజానికి ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో చేసినా… కావాల్సింది గుడ్ కంటెంట్. వాళ్లు తెరకెక్కించిన కంటెంట్ ను కూడా బాగా ప్రజెంట్ చేయాలి. అప్పుడే సినీ లవర్స్ కి మూవీ రీచ్ అవుతుంది.
కానీ, రాబిన్ హుడ్ మూవీ టీం మాత్రం… కంటెంట్ పై ఫోకస్ పెట్టకుండా… ప్రమోషన్స్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. గతంలో ఇలానే సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీం ప్రమోషన్స్ కి ఎక్కువ టైం ఇచ్చారు. అయితే వెంకటేష్ – అనిల్ రావిపూడి ప్రమోషన్స్ తో పాటు మూవీలోని కంటెంట్ ను కూడా బాగా ప్రజెంట్ చేశారు. దీంతో మూవీ చూడాలని ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
ఆ ఒక్కటి రాబిన్ హుడ్ మూవీ టీం కూడా ఫాలో అయితే… పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పొచ్చు.