Cooling Spray For Skin: సమ్మర్‌లో స్కిన్ కేర్ పాటించడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఎండల కారణంగా ముఖం నల్లగా మారుతుంది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే ట్యాన్ పేరుకుపోతుంది. ఇలాంటి సమయంలో రకరకాల ఫేస్ క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే వీటన్నిటికి బదులుగా ఇంట్లోనే స్ప్రేలను తయారు చేసుకుని ముఖానికి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇవి చర్మానికి తక్షణ మెరుపును అందిస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని రోజంతా తాజాగా ఉంచుతాయి. సమ్మర్ లో వీటిని వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇంట్లోనే ఫేస్ స్ప్రే ఎలా తయారు చేసుకుని ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
DIY ఫేస్ స్ప్రేలు సూపర్ హైడ్రేటింగ్ , చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని రోజంతా తాజాగా ఉంచుతాయి. ఇంట్లో తయారు చేసుకునే స్ప్రేలు అరోమాథెరపీటిక్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.
1.సూపర్ రిఫ్రెషింగ్ దోసకాయ ఫేస్ స్ప్రే:
చర్మాన్ని తాజాగా, చల్లగా ఉంచడానికి దోసకాయను ఉపయోగిస్తారని మనందరికీ తెలుసు. ఇది వడదెబ్బ వల్ల కలిగే చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
తయారీ విధానం: రిఫ్రెషింగ్ దోసకాయ ఫేస్ స్ప్రే తయారు చేయడానికి.. ముందుగా ఒక దోసకాయను మిక్సీ పట్లుకుని అందులోనే నాలుగు నుండి ఐదు తాజా పుదీనా ఆకులను వేసి మెత్తగా పేస్ట్ చేయండి. పుదీనా, దోసకాయ పేస్ట్‌ని వడకట్టి కాస్త నీరు తీసుకుని బాగా కలపండి. తర్వాత దీనిని స్ప్రే బాటిల్‌లో వేసి.. ఒక వారం పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉపయోగించండి.
2.సూపర్ రైస్ వాటర్ స్ప్రే:
ఈ రోజుల్లో బియ్యం నీటిని కొరియన్ బ్యూటీ స్కిన్ కేర్‌లో ఉపయోగిస్తున్నారు. పులియబెట్టిన బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు కూడా ఉండటం వల్ల , దీని
వాడకం చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడుతుంది.
తయారీ విధానం: పులియబెట్టిన బియ్యం నీటిని తయారు చేయడానికి.. ముందుగా ముడి బియ్యాన్ని బాగా శుభ్రం చేసి.. ఒక గ్లాసు డిస్టిల్డ్ వాటర్‌లో నానబెట్టండి. చర్మానికి ఉత్తమమైన, అత్యంత పరిశుభ్రమైన స్టార్చ్ నీటిని ఒక సీసాలో వేసి ప్రతిరోజూ వాడండి.
3. విటమిన్ సి స్ప్రే:
విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం. ఎందుకంటే ఇది కొల్లాజెన్‌ను పెంచడం ద్వారా ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా చర్మపు రంగును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఎండల కారణంగా రంగు మారిన వారు ఈ విటమిన్ సి స్ప్రే వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
తయారీ విధానం: విటమిన్ సి స్ప్రే చేయడానికి.. ఒక కప్పు వేడి నీటిలో మూడు నుండి నాలుగు మందార టీ బ్యాగులను వేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. అదే మందార నీటిలో, అర టేబుల్ స్పూన్ విటమిన్ సి పౌడర్ లేదా కాహర్సల్ఫ్యూల్ వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసి ప్రతి రోజూ ఉపయోగించండి.
Also Read: బార్లీ వాటర్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
4.హైడ్రేటింగ్ కొబ్బరి & అలోవెరా స్ప్రే:
కొబ్బరిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, హైడ్రేట్ చేయడంలో అలాగే చర్మంపై మృత కణాలను తొలగించడంతో పాటు బ్యాక్టీరియాను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
తయారీ విధానం: DIY హైడ్రేటింగ్ స్ప్రేను తయారు చేయడానికి.. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌కు ఒక టేబుల్ స్పూన్ కరిగించిన కొబ్బరి నూనెను కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమానికి 60 ml నీరు వేసి బాగా మిక్స్ స్ప్రే బాటిల్ సహాయంతో ఉపయోగించండి.