Guru Gochar 2025: దేవగురు బృహస్పతి సంచారము అనేక రాశులకు ఆనందం, శ్రేయస్సు, పురోగతిని తెస్తుంది. బృహస్పతిని సంపద, జ్ఞానం, శ్రేయస్సు, మతం, విద్య, పిల్లలు, ఆధ్యాత్మికతకు ప్రధాన కారకంగా చెబుతారు. దేవగురువు బృహస్పతి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఆర్థిక పరిస్థితి, వృత్తి ,ఆస్తి విషయాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
మృగశిర నక్షత్రంలో గురుడి నక్షత్ర సంచారం 12 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై అధిక ప్రభావం ఉంటుంది.
వేద జ్యోతిష్యశాస్త్రంలో దేవ గురువు బృహస్పతికి గురువు హోదా ఉంది. బృహస్పతి తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా.. అది 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. కొంతమందికి ఈ మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. మరి కొందరికి ఇది మిశ్రమ ప్రభావాలను ఇస్తుంది. ఏప్రిల్ 10 2025న, సాయంత్రం 7:51 గంటలకు బృహస్పతి మృగశిర రాశిలోకి ప్రవేశిస్తాడు.
మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు. ఇది శక్తి, అభిరుచి, చర్య , విస్తరణతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం ఆర్థిక పరిస్థితి, వృత్తి, ఆస్తి విషయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంచారం కొన్ని రాశులకు మంచిది. మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం అనేక రాశుల వారికి అదృష్టం, వృత్తి ,ఆర్థిక స్థితిలో పెద్ద మార్పులను తెస్తుంది. ఈ సంచారము ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి.. గురుడి సంచారము ఆర్థిక, కుటుంబ జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఇదే కాకుండా.. పబ్లిక్ డీలింగ్, మార్కెటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగంలో పనిచేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఇది కొత్త వ్యాపార ప్రయోజనాలకు దారి తీస్తుంది. కుటుంబ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి:
గురుడి సంచారం వృషభ రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుతాయి. స్టాక్ మార్కెట్ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే సంకేతాలు ఉన్నాయి. అంతే కాకుండా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఈ సంచారము వివాహం , ప్రేమ సంబంధాలకు కూడా శుభప్రదంగా ఉంటుంది. వివాహంపై ఆసక్తి ఉన్నవారికి.. మంచి సంబంధాలు వస్తాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా మీ సంబంధాలు స్థిరంగా మారతాయి.
Also Read: అక్షయ తృతీయ 2025 తేదీ..శుభ ముహూర్తం, పూజా విధానం
సింహరాశి:
గురుడి సంచారము సింహ రాశి వారికి కెరీర్‌లో కొత్త మలుపులను తెస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారికి ఇది చాలా మంచి సమయం. అంతే కాకుండా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఆఫీసుల్లో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. అంతే కాకుండా మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఇది మీ కెరీర్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళుతుంది. ఇది కాకుండా ఆస్తి , పెట్టుబడికి సంబంధించిన విషయాలలో ప్రయోజనాలు ఉంటాయి.