Rambha: అలనాటి నటీమణులు చాలామంది ఇప్పటికీ ప్రేక్షకులకు క్రష్‌గా ఉన్నారు. అలాంటి హీరోయిన్స్‌లో రంభ కూడా ఒకరు. ‘అరగియ లైలా’ అంటూ అప్పట్లో రంభ చేసిన పాట, అందులో తన స్టెప్పులను ఇప్పటికీ మూవీ లవర్స్ అభిమానిస్తూనే ఉంటారు. అప్పుడు, ఇప్పుడు రంభ ఒకేలా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. పెళ్లయినప్పటి నుండి తను పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయింది. అలాంటి లైలా.. మళ్లీ ఇంతకాలం తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆ సెకండ్ ఇన్నింగ్స్ చాలావరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలోనే తన పర్సనల్ లైఫ్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టింది.
చెప్పకుండా వెళ్లిపోయా
రంభ ప్రస్తుతం ఒక టీవీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకుంది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఒకసారి నా భర్తతో చిన్న గొడవ జరిగింది. నేను కోపంలో బ్యాగ్స్ అన్నీ సర్దుకొని తనకు చెప్పకుండా కెనడా నుండి చెన్నై వచ్చేశాను. నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత నా ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యాను. వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్లు చాలా కంగారుపడ్డారు. నేను ఇండియాకు వెళ్లిపోయానని తెలియక నా భర్త కెనడా మొత్తం నాకోసం వెతికాడు’’ అని బయటపెట్టింది రంభ. దీంతో ప్రతీ యాక్టర్ పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి గొడవలు జరగడం సహజమని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పాపులర్ హీరోయిన్
చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రంభ. 1992లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’తో హీరోయిన్‌గా మారింది. మొదటి సినిమానే సూపర్ సక్సెస్ అవ్వడంతో రంభ (Rambha)కు ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. ఏడాదికి దాదాపు అరడజను సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అలా తనకు ఇక్కడ ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉన్నా కూడా కొన్నేళ్ల పాటు రంభ క్రేజ్ అస్సలు తగ్గలేదు. తను నటించిన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా కొన్నేళ్ల పాటు తను ఫుల్ బిజీగా గడిపేసింది.
Also Read: మళ్లీ ప్రేమలో పడిన శృతి.. ఆ డైరెక్టర్‌పై ప్రేమ ఒలకబోస్తూ
ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ
2010లో కెనడాలో సెటిల్ అయిన బిజినెస్‌మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది రంభ. పెళ్లి అయినప్పటి నుండి తను సినిమాల వైపు తిరిగి చూడలేదు. తను కూడా భర్తతో వెళ్లి కెనడాలోనే సెటిల్ అయ్యింది. వీరికి ఇద్దరూ కూతుళ్లు, ఒక కొడుకు కూడా పుట్టారు. అలా భర్త, పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయింది ఈ సీనియర్ నటి. అలా అసలు రంభ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనే విషయం చాలాకాలం పాటు ప్రేక్షకులకు తెలియలేదు. కానీ మెల్లగా తను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది రంభ.