Ind vs Pak: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy ) భాగంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ( Ind vs Pak match ) జరుగుతున్న మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. టీమ్ ఇండియా బౌలర్ల దాటికి… ఎక్కడ కూడా కోలుకోలేదు పాకిస్తాన్ ఆటగాళ్లు. ఈ తరుణంలోనే 49.4 ఓవర్లలో… పాకిస్తాన్ 241 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav ), అక్షర్ పటేల్ ( Axar Patel ), రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) అలాగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) దుమ్ము లేపడంతో… పాకిస్తాన్ 241 పరుగులకే ఆల్ అవుట్ కావడం జరిగింది.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 242 పరుగులు చేయాల్సి ఉంటుంది. దాదాపు పది నిమిషాల తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే, వైస్ కెప్టెన్ గిల్ ఇద్దరు ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఇక అంతకుముందు… ఈ మ్యాచ్ లో టాస్ గెలిచింది పాకిస్తాన్ టీం. ఈ నేపథ్యంలోనే… పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మొదట బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం 49.4 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 241 పరుగులు చేసింది. మొదట్లో బాగా ఆడిన పాకిస్తాన్ టీం చివరి… వరకు ఆ ఊపు కొనసాగించలేదు. ముఖ్యంగా ఓపనర్లు అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో టీమిండియా ముందు 242 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది పాకిస్తాన్ టీం. పాకిస్తాన్ ఆటగాళ్లలో ఓపెనర్ ఇమామ్ అక్షర్ పటేల్ చేతిలో రన్ అవుట్ అయ్యాడు.
అతను పది పరుగులకే అవుట్ కావడం. ఆ తర్వాత బాబర్ 23 పరుగులు చేసి హార్థిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ( Mohammed Rizwan ) 77 బంతులు 46 పరుగులు చేసే దుమ్ము లేపాడు. ఇక చివర్ లో కుష్ దిల్ 37 పరుగులతో రాణించాడు. హరీస్ రాఫ్ కూడా ఒక సిక్సర్ బాది పర్వాలేదనిపించాడు. టీమిండియా బౌలర్లలో… మహమ్మద్ షమీ ఒక వికెట్ తీయకపోగా… విరాళంగా పరుగులు. అలాగే అక్షర్ పటేల్ ఒక వికెట్, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా… హర్షిత్ రానా ఒక వికెట్, రవీంద్ర జడేజా మరో వికట్ తీశాడు. ఇక కుల్దీప్ యాదవ్ 9 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు తీశాడు. 49వ ఓవర్ లో హర్షిత్ రానా..పాకిస్థాన్ చివరి వికెట్ తీసి.. ఆలౌట్ చేశాడు.
Also Read: Hardik Pandya: పాక్ ప్లేయర్లకు చేతబడి.. పాండ్యా ఫోటోలు వైరల్ !