Rahu Gochar 2025: రాహువు ప్రజలను అనారోగ్యం, జూదం, కఠినమైన మాటలు , దొంగతనం వంటి చర్యలలోకి నెట్టివేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు రాశిని మార్చినప్పుడల్లా ఈ ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అంతే కాకుండా రాశుల వారిలో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుంది. సాధారణంగా రాహువు ఒక రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు. 2025 కొత్త సంవత్సరంలో..రాహువు మే 18 సాయంత్రం 4.30 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా 3 రాశులపై అధిక ప్రభావం ఉంటుంది. మరి రాహువు ప్రభావం ఏ రాశులపై ఉంటుంది. రాహువు సంచారం వల్ల ప్రయోజనాలు పొందే రాశులను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
మే 2025లో రాహు సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాహువు సంచారం వల్ల మిథునరాశి వారికి ఉపాధిని కల్పిస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితిలో కూడా పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌తో కూడిన పదోన్నతుల ప్రయోజనం ఉంటుంది. మీరు వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకుంటాు. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండేందుకు అవకాశాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల పట్ల కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతే కాకుండా విద్యాపరంగా కూడా విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ రాశి:
రాహువు సంచారం వృషభ రాశికి చెందిన వ్యక్తుల అదృష్టాన్ని కలుగజేస్తుంది. అంతే కాకుండా దీని శుభ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ వ్యక్తులు అనేక శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇదే కాకుండా.. ఆలోచించే , అర్థం చేసుకునే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో కూడా విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కీలక విషయాల పట్ల నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా వ్యాపారంలో మంచి లాభాలను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. విద్యాపరంగా కూడా మంచి శుభవార్తలు అందుకుంటారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
Also Read: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి బుధుడు.. వీరికి అదృష్టం
కుంభ రాశి:
కుంభ రాశి వారికి రాహువు రాశి మార్పు చాలా సానుకూలంగా ఉండబోతోంది. ఈ వ్యక్తులు వారి ఆదాయంలో ఊహించని పెరుగుదలను చూస్తారు. అలాగే, ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ సమయం సంతోషంగా ఉండబోతోంది. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ , ఇంక్రిమెంట్ తో పాటు లగ్జరీ సౌకర్యాల ప్రయోజనాలను పొందుతారు. మీరు ఉన్నత అవకాశాలు పొందే ఆస్కారం ఉంది. అంతే కాకుండా అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడిపేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిది. వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. అంతే కాకుండా మీరు ఈ సమయంలో విజయాలు అందుకునే అవకాశాలు కూాడా ఉన్నాయి.