BigTV English

Forest Officers Action Plan: అటవీశాఖ అదిరిపోయే ఐడియా.. ఈ దెబ్బతో టైగర్ పరార్.. జనాలు సేఫ్

Forest Officers Action Plan: అటవీశాఖ అదిరిపోయే ఐడియా.. ఈ దెబ్బతో టైగర్ పరార్.. జనాలు సేఫ్

పులుల రాక కోసం ఏర్పాట్లు


పులి ఇష్టంగా తినే ఆహారమైన జింకలు, దుప్పులు, మచ్చల జింకలు, మనుబోతులు, కొండ గొర్రెల సంఖ్య పెరిగేలా చూసుకుంటున్నారు. అడవుల్లో శాఖాహార జీవుల కోసం కృత్రిమంగా పశుగ్రాసం కూడా పెంచుతున్నారు. నీటి చెలిమలు తీశారు. చెక్ డ్యాంలు కట్టారు. ఇంత చేసింది పులుల రాక కోసమే.. అవును మీరు విన్నది నిజమే. కానీ ఏం జరుగుతోంది?

టైగర్ జోన్ లో పులిని పట్టుకోవడం అసాధ్యం

కాబట్టి టైగర్ రిజర్వ్ అంటే అక్కడ ఏం చేసినా పులుల కోసమే. వాటి సంతతిని పెంచడం కోసమే. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది. కోర్ జోన్ సమీపంలో ఉన్న గ్రామాలకు ఇప్పుడు పులి టెన్షన్ పట్టుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ఏరియాల నుంచి పులుల రాక పెరిగింది. గత నెల రోజుల నుంచైతే రోజూ ఎక్కడో చోట జనం కంట పడుతూనే ఉన్నాయి. రోజుకో జోన్ మారుస్తున్నాయి. సేఫ్ ప్లేస్ కోసం తిరుగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ కు అటు ఇటు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో ఐదు వరకు పులులు ఉండొచ్చంటున్నారు. అయితే ఇవి ఎప్పుడు తిరిగి వెళ్తాయో చెప్పలేం. సో రావడం, పోవడం వాటి ఇష్టమే.

గ్రామాల్లో పెరిగిన హ్యూమన్ – టైగర్ కాన్ ఫ్లిక్ట్

సో ఇక్కడ పులి పాదముద్రలు సేకరించడం, ఎవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో చూడడమే అటవీ అధికారుల పని. పులిని పట్టుకుని మరో చోట వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది టైగర్ జోన్ కాబట్టి. ఇది పులుల కోసమే క్రియేట్ చేసింది కాబట్టి. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటంటే పులులు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో ఆ గ్రామాలనే ఖాళీ చేయించడమే ఆప్షన్. ఇక్కడ హ్యూమన్ – టైగర్ కాన్ ఫ్లిక్ట్ ఎక్కువైంది. గతంలో పులుల రాక పెరగడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశుమాంసాన్ని ఎరగా పెట్టి అందులో విషం కలిపి వాటిని చంపేసిన ఘటనలున్నాయి. సో ఇప్పుడు పులి అలజడి పెరగడంతో అలాంటి చర్యలకు పాల్పడొద్దని అటవీ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

Also Read: విగ్రహం టచ్ చేసి చూడు.. మీ పనైపోయిందంటూ యెన్నం ఫైర్

కవ్వాల్ అభయారణ్యంలో టేకు వెదురు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాతావరణం పులులకు మంచి ఆవాసం. అందుకే దీన్ని టైగర్ జోన్ గా ఎంపిక చేశారు. మొత్తం 673 రకాల వృక్ష జాతులు, 310 రకాల పక్షిజాతులు, 68 రకాల క్షీరద జాతులు, సరీసృపాలు, ఉభయచరాలూ ఇలాంటివెన్నో ఉన్నాయి. సో పర్యావరణంలో అన్ని జీవులకు స్థానం ఉండాల్సిందే. పులి ఉంటేనే అడవి ఉంటుంది. ఫుడ్ చైన్ లో పులులు ఉండడం చాలా కీలకం. అయితే ఇప్పుడు పులి ఉండాలి. మనుషులకు ఇబ్బంది ఉండొద్దు. అందుకు ఏం చేయాలన్నదే పెద్ద టాస్క్ గా మారింది.

జనం గుంపులుగా వెళ్లాలని సూచనలు

ప్రజలను గుంపులుగా గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు ఇప్పటికే సూచించారు. గుంపులో ఒకరు పులిని చూసేందుకు అలర్ట్ గా ఉండాలన్నారు. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోకి రాకపోకలను నిషేధించారు. పొలాల్లో పనిచేసే వారికి మాస్క్‌లు పంపిణీ చేశారు. పులులు దాడి చేయకుండా ఉండేందుకు వాటిని తల వెనుక భాగంలో పెట్టుకోవాలన్నారు. చేలల్లోకి వెళ్తున్న వారిలో కొందరు ఈ మాస్కులు పెట్టుకుని వెళ్తున్నారు. పులుల దాడితో కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం బెంగాలీ క్యాంప్‌‌‌‌లు, అనుకొడ, గన్నారం, మండ్వా, సిర్పూర్ (టి) మండలం ఇటికలపహాడ్, చింతకుంట, చీలపల్లి, ఆరెగూడ, పెద్దబండ, చుంచుపల్లి గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కొందరు మధ్యాహ్నం పూట బయటకు వస్తున్నా సాయంత్రం నాలుగు దాటిందంటే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

పత్తి తీసేందుకు భయం భయం

ఇప్పుడు సమస్య ఏంటంటే.. పులి ఉందని చెప్పి జనం బయటకు రాకుండా పోతున్నారు. ఇప్పుడు పత్తి ఏరే సీజన్. అయితే చేలల్లో పులి ఎటువైపు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియదు. సో వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అటు అడవుల్లోకి వెదురు కర్రల కోసం, చీపురు పుల్లలు ఏరుకునేందుకు వెళ్లే వారికి కూడా ఉపాధి లేకుండా పోతోంది. అడవిలోకి అడుగు పెట్టేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఒప్పుకోవడం లేదు. అంతే కాదు. ప్రాణం కంటే కూలీ ఎక్కువా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఉపాధి లేకుండా బతకడం ఎలా అని అడుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో పులి భయం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఏంటంటే.. పులి నైనా పట్టండి.. కూలీ అయినా ఇవ్వాలంటున్నారు.

 

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×