Shani Gochar 2025 : మార్చి 29, 2025న శని కుంభరాశి నుండి దేవగురువు బృహస్పతి స్వంత రాశి అయిన మీన రాశిలోకి సంచరించబోతున్నాడు. శని సంచారం ప్రతి రాశి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
మీన రాశిలో శని యొక్క సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. శని ఏ రాశిని సంచరించినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శని సంచారం వల్ల ప్రభావితం కాబోతున్న రాశుల వారు వృత్తి, వ్యాపారాలలో ఊహించని పురోగతిని అందుకుంటారు. అంతే కాకుండా శని సంచార వల్ల ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. మరి శని సంచారం ఏ ఏ రాశుల వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే విషయాలను గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారు శని సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. అంతే కాకుండా మీ ఆదాయంలో ఊహించని పెరుగుదల కూడా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కవ కాలం నుండి పెండింగ్ లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా అకస్మాత్తుగా మీరు విజయాలు పొందే సమయం ఇది. వ్యాపారులు కూడా అధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా మీ ఆదాయాలను పెంచుకోవడానికి అనేక అవకాశాలు కూడా లభిస్తాయి. మనస్సు కూడా ఆనందంతో నిండిపోతుంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీ స్థానికులు, రహస్య శత్రులపై కూడా మీరు విజయాలను సాధిస్తారు.
తులా రాశి:
శని సంచారం తులారాశికి శుభప్రదంగా ఉంటుంది. మీరు పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. మీరు పెద్ద ప్రాజెక్టులను పొందేందుకు ఇది అనుకూలమైన సమయం. తులా రాశి వారికి శుభవార్తలు అందుతాయి. సంపదలో పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా తీసుకోండి. అంతే కాకుండా మీ ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు కూడా అందుకుంటారు. మీ వైవాహిక జీవితం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మీరు మత పరమైన కార్యక్రమాల్లో పాల్లొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
Also Read: మహిళా నాగసాధువులు ఎక్కడ ఉంటారు ? వీరి గురించి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు !
మకర రాశి:
మీన రాశిలో శని సంచారం మకర రాశి వారికి విశేష ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా మకర రాశి వారికి ధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారు పెండింగ్‌లో ఉన్న డబ్బును పొందేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ఉద్యోగం, వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో శాంతి ఉంటుందిజ అంతే కాకుండా మీరు కుటుంబ సభ్యులతో సంతోషరమైన జీవితాన్ని గడుపుతారు.