Jaipal Reddy: మాజీ మంత్రి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు జైపాల్ రెడ్డి పట్ల చాలా గౌరవం ఉండేదన్నారు. నిజాయతీ, నిఖార్సైన నాయకుడు జైపాల్ రెడ్డి అని చెప్పారు. ఆయనతో తనకు చాలా మంచి రిలేషన్ షిప్ ఉండదేని.. చాలా విషయాల్లో తాము విభేదించుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. తను జైపాల్ రెడ్డి జూనియర్ కావడంతో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని.. ఆయనకు తన కుటుంబం తరఫున ఘన నివాళులు చెప్పారు.
నేడు దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినోద్ కుమార్, మందుల సామెల్ సహా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో ఆయన పోషించిన పాత్ర గొప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి కీలకమైందని ఎమ్మెల్యే వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన ఆనంతరం మాట్లాడారు. జైపాల్ రెడ్డి చేవెళ్ల ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. వారు చూపించిన మార్గంలో నడవడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు జైపాల్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మరచిపోరని చెప్పారు. తమ ప్రాంతంలో ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జైపాల్ రెడ్డి జయంతి సందర్బంగా ఘనమైన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన టైంలో జైపాల్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా కీలక పాత్ర పోషించారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆయన పేరు పెట్టడం సంతోషకరకంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Also Read: APCOB Jobs: గుడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు
నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు. ప్రస్తుత రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. దేశ చరత్రిలో ప్రజాస్వామ్య విలువలుకాపాడిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సాకారం చేయడంలో ఆయన పాత్ర మరవలేనిదని అన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో వాయిస్ ఓటుతో బల్లు ఆమోదానికి గైడ్ చేసిన వ్యక్తిగా జైపాల్ రెడ్డి నిలిచారని అన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి, మెట్రో రైలు రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది అన్నారు. మెట్రో రైల్‌కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.