BigTV English

Manchu Manoj :వివాదంపై స్పందించిన మనోజ్.. ప్రశ్నిస్తే కేసు పెట్టారంటూ..?

Manchu Manoj :వివాదంపై స్పందించిన మనోజ్.. ప్రశ్నిస్తే కేసు పెట్టారంటూ..?

Manchu Manoj..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో మంటలు చల్లారేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఆస్తుల వివాదాలు అన్నదమ్ముల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించే వారే లేరా అంటూ అభిమానులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు (Mohanbabu) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా.. మోహన్ బాబు ఏకంగా జర్నలిస్టులపై దాడి చేసి, బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఇక ఇప్పుడు తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.


అయితే ఇదంతా బాగానే ఉన్నా.. నిన్న తన కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో తిరుపతిలో సంక్రాంతి ఘనంగా జరుపుకోవాలని మంచు మనోజ్ (Manchu Manoj), తన భార్య మౌనిక (Mounika)తో కలిసి తిరుపతికి వచ్చారు. అయితే యూనివర్సిటీ పై దాడి చేయడానికి వచ్చారు అని, ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారని మోహన్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. మనోజ్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అనుమతులను నిరాకరిస్తూ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లకుండా ఆపేశారు. అయితే ముందే మోహన్ బాబు యూనివర్సిటీ వరకు వెళ్లిన మంచు మనోజ్ దంపతులను అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో చేసేదేమీ లేక పక్కనే ఉన్న ఫార్మ్ హౌస్ లో తన నానమ్మ, తాతల సమాధులకు దండం పెట్టుకొని ఆ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు.

మా కుటుంబ వివాదం గురించి స్పందించలేదు..


దీనిపై మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నేను రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారా వారి పల్లెలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్.(Nara Lokesh)ను వెళ్లి కలిశాను. అయితే వారిని కలిసినప్పుడు నేను నా కుటుంబ వ్యవహారాలను ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఈ గొడవల గురించి ఏమాత్రం కూడా వారితో నేను మాట్లాడలేదు. నా కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో ఇక్కడే జరుపుకోవాలని అనుకున్నాను. కానీ నావల్ల వివాదం అవుతుందని అనుకోలేదు. నిన్న కూడా ఏదైతే విఐపి ల షెడ్యూల్ పూర్తయిందో, ఆ తర్వాతనే నేను రావాలని అనుకున్నాను. కానీ లోకేష్ గారు కార్యకర్తల సమావేశంలో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల, నేను ముందుగానే వెళ్లాను. దాంతో అక్కడ ఆయన ఉండడంతో ఆయనను కలిశాను. అంతే తప్ప మా కుటుంబ వివాదాల గురించి ప్రస్తావించలేదు.

ఫీజుల పేరిట విద్యార్థుల నెత్తిపై రుద్దుతున్నారు..

నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే, కావాలనే మా మనుషుల మీద, అభిమానుల మీద దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై నేను ప్రశ్నించాను. అందుకే నా మీద వారు కోపంతో ఊగిపోతున్నారు. బయట కంపెనీలు పెట్టి ఇక్కడ విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్నో విషయాలను విద్యార్థుల నెత్తి పైన రుద్దుతున్నారు. ముఖ్యంగా పదవ తరగతి తర్వాత యూనిఫారం వేసుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటిది ఇంజనీరింగ్, పీజీలో కూడా యూనిఫామ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మోహన్ బాబు విద్యాసంస్థల్లో ఉంది. నేను దీనిని ప్రశ్నించాను. నా అభిమానులు, నాతో సన్నిహితంగా మెలిగిన వారిని దూరం చేయాలని, వారిని జనవరి 12వ తేదీన పిలిపించి మరీ బెదిరించారు. దీనికి తోడు నాపై కేసులు కూడా పెట్టారు. ఏది ఏమైనా తప్పు జరుగుతోందని.. ఇలా ఎందుకు జరుగుతోందని ? ప్రశ్నించడం వల్లే నాపై కేసులు పెట్టారు అంటూ మంచు మనోజ్ తెలిపారు.

అస్వస్థతకు గురైన మంచు మనోజ్..

ఇకపోతే హీరో మంచు మనోజ్ అస్వస్థతకు గురయ్యారు.. నిన్న అనగా బుధవారం మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన ఫిర్యాదు అనంతరం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడుతుండగా.. తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక మనోజ్ ని చూసి ఆయన భార్య మౌనిక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×